క‌త్రినాతో సినిమా చేయ‌టానికి నో చెప్పేశాడు

క‌త్రినాతో సినిమా చేయ‌టానికి నో చెప్పేశాడు

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ న‌టుడికి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినాతో జ‌త క‌ట్టే అవ‌కాశం వ‌స్తే వ‌ద్దంటారా?  అస‌లు ఆ ఆలోచ‌న‌కే నో చెబుతారు. అలాంటిది ఆమెతో సినిమా చేసేందుకు నో అంటూ తెగేసి చెబుతూ వార్త‌ల్లోకి వ‌చ్చారు స‌ల్మాన్ బావ‌.. ల‌వ్ రాత్రి మూవీ హ‌రో ఆయుష్ శ‌ర్మ‌.

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ నిర్మిస్తున్న సినిమాలో ఆయుష్ శ‌ర్మ‌తో క‌లిసి న‌టించేందుకు క‌త్రినా నో చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ భామ‌తో జ‌త క‌ట్టేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని ఒక  ప్ర‌ముఖ వెబ్ సైట్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఆన్ స్క్రీన్ తో పాటు.. ఆఫ్ స్క్రీన్ లోనూ క‌త్రినా.. స‌ల్మాన్ ల మ‌ధ్య స‌న్నిహిత సంబంధం ఉన్న‌ట్లుగా ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ధ్య‌లో వారిద్ద‌రి మ‌ధ్య బంధం బ్రేక‌ప్ కావ‌టం.. అనంత‌రం క‌త్రినా ర‌ణ్ బీర్ ల‌తో డేటింగ్ లో ఉన్నారు.

ఈ మ‌ధ్య‌న ర‌ణ్ బీర్ తో డేటింగ్ క‌థ కంచికి వెళ్ల‌టం.. అదే స‌మ‌యంలో స‌ల్మాన్ తో టైగ‌ర్ జిందాహై మూవీలో క‌లిసి చేయ‌టంతో వీరి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా వీరిద్ద‌రూ క‌లిసి భార‌త్ మూవీలో న‌టిస్తున్నారు. త‌న బావ‌కు స‌న్నిహిత‌మైన క‌త్రినాతో ఆన్ స్క్రీన్ జ‌త‌కు ఆయేష్ శ‌ర్మ నో చెప్ప‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English