చైతూ..? సమంత..? చైసామ్..?

చైతూ..? సమంత..? చైసామ్..?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భార్యాభర్తలైన అక్కినేని నాగచైతన్య.. సమంతల సినిమాలు వినాయక చవితి కానుకగా ఒకే రోజు విడుదలవుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక అరుదైన సందర్భం అనే చెప్పాలి. అనివార్య పరిస్థితుల్లో పోటీకి సిద్ధమైన ఈ జంటకు ఎలాంటి ఫలితం దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలకూ పాజిటివ్ బజే ఉంది.

కానీ.. వీటిలో క్రౌడ్ పుల్లర్ మాత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రమే. ఆ చిత్రంలో సగటు ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా కనిపిస్తోంది. దర్శకుడు మారుతి మార్కు వినోదం సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. తెలుగు సినిమాల్లో అత్తా అల్లుళ్ల కథలతో వచ్చిన సినిమాల్లో చాలా వరకు మంచి విజయం సాధించాయి. చాన్నాళ్ల తర్వాత ఈ తరహా కథ చూడబోతున్నారు ప్రేక్షకులు. పండగ సీజన్లో రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. చైతూ సినిమాల్లో దీనికి అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచే అవకాశాలున్నాయి.

ఇక ‘యు టర్న్’ విషయానికొస్తే ఇది కన్నడలో ఇదే పేరుతో విడుదలైన విజయవంతమైన సినిమాకు రీమేక్. గత కొన్నేళ్లుగా తెలుగులో వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. వాటి కోవలోకే ఇదీ చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీని ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించింది. ఐతే ఇలాంటి సినిమాలకు మంచి టాక్ వచ్చాకే కలెక్షన్లు పెరుగుతాయి. మరి టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకీ చవితి నాడు చైతూ గెలుస్తాడా.. సమంత నెగ్గుతుందా.. లేక ఇద్దరూ డబుల్ ధమాకా సక్సెస్ సాధిస్తారా చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English