నాగార్జున వెంటనే కర్చీఫ్‌ వేసేసాడు

నాగార్జున వెంటనే కర్చీఫ్‌ వేసేసాడు

నాగచైతన్య సినిమాలన్నిటికీ ఎడిటింగ్‌ టేబుల్‌ వద్ద నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. ఫైనల్‌ కట్‌ చూసి డిసైడ్‌ అయ్యే హెడ్డేక్‌ తన తండ్రికే వదిలేస్తాడు చైతన్య. అలాగే శైలజారెడ్డి అల్లుడు కూడా నాగార్జునకి చైతన్య చూపించాడట. సినిమా చూసిన వెంటనే నాగార్జున చాలా బాగుందంటూ మారుతిని పిలిపించి అడ్వాన్స్‌ ఇచ్చాడట. అన్నపూర్ణ బ్యానర్లో త్వరలోనే సినిమా చేద్దామని, అఖిల్‌ కోసం కథ సిద్ధం చేయమని నాగార్జున అడిగాడట.

మారుతితో మహానుభావుడు చిత్రాన్నే అఖిల్‌ చేయాల్సి వుంది కానీ అప్పుడు మెటీరియలైజ్‌ అవలేదు. శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని మారుతి తీర్చిదిద్దిన తీరు నచ్చడంతో అఖిల్‌తో సినిమా నాగ్‌ ఖాయం చేసుకున్నాడు. అఖిల్‌తో మారుతి కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపాడు కానీ ప్రస్తుతానికి అఖిల్‌కి సూట్‌ అయ్యే కథ తన దగ్గర లేదు. మరో ఇద్దరు యువ హీరోలతో మారుతికి ఒప్పందాలున్నాయి.

వచ్చే రెండేళ్లలో అయితే అఖిల్‌తో మారుతి సినిమా ఖచ్చితంగా వుంటుంది. అలాగే చైతన్యతో మరో సినిమా చేయడానికి కూడా మారుతి మాట ఇచ్చాడని సమాచారం. శైలజారెడ్డి అల్లుడు అంచనాలని అందుకున్నట్టయితే మాత్రం మారుతి యువ హీరోలకి మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌ అయిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు