సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టిన కమెడియన్‌

సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టిన కమెడియన్‌

కమెడియన్స్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించడం కొత్తేమీ కాదు. సునీల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో పలు చిత్రాల్లో కనిపించాడు. అయితే అతడిని హీరోగా జనం యాక్సెప్ట్‌ చేయకపోవడంతో ఎక్సర్‌సైజు మానేసి మునుపటిలా గుండ్రంగా తయారైపోయి కామెడీ వేషాలు వేసుకుంటున్నాడనుకోండి. తాజాగా మరో కమెడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ అవతారంలో కనిపించి షాకిచ్చాడు. తమిళనాట ప్రస్తుతం స్టార్‌ కమెడియన్‌ స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తోన్న సూరి ఎందుకో సిక్స్‌ ప్యాక్‌ బాడీ పెంచాడు.

శివ కార్తికేయన్‌, సమంత జంటగా నటిస్తున్న 'సీమ రాజా' చిత్రంలో సూరి సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నాడు. సాధారణంగా హీరోలు సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో ఫోటోలు వదులుతుంటారు. కానీ ఈసారి కమెడియన్‌ సిక్స్‌ ప్యాక్‌ స్టిల్‌ వదిలి నెట్‌లో హల్‌చల్‌ చేసారు. సూరి ఇంకా హీరో వేషాలు వేయడం లేదు కానీ అతనికి కూడా సునీల్‌ మాదిరిగా యాక్షన్‌ హీరో కావాలనే కలలు వున్నట్టే వున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలానే తమిళంలో కూడా పాపులర్‌ అయిన కమెడియన్లని హీరోలని చేసేయడం ఆనవాయితీగా వస్తోంది. సంతానం లాంటి కమెడియన్లు అలా హీరోలుగా మారి ఎక్కువగా కనిపించకుండా పోయారు. మరి సూరి సంగతేంటనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు