తనీష్‌కి తమ్ముడు కూడా దెబ్బ వేసాడు

తనీష్‌కి తమ్ముడు కూడా దెబ్బ వేసాడు

బిగ్‌బాస్‌లో హీరో స్టేటస్‌తో అడుగు పెట్టిన తనీష్‌ ఈ సీజన్‌కి తానే విన్నర్‌ని అనుకుంటాడు. తనని తాను ప్లేబాయ్‌గా లెక్క వేసుకునే తనీష్‌ ఈ మూడు నెలల్లో చేయని ఫీట్లు లేవు. సోదరి అంటూనే దీప్తి సునయనతో అతను పెట్టుకున్న రిలేషన్‌ పలు విమర్శలకి తావిచ్చింది. ఆ తర్వాత 'అమ్మ' అని పిలుస్తూ దీప్తి నల్లమోతుతో బండగా వ్యవహరిస్తోన్న తీరు కూడా విమర్శల పాలవుతోంది. నానితో వున్న అనుబంధం కారణంగా పలుమార్లు ఎలిమినేషన్‌ తప్పించుకున్నాడని, నామినేట్‌ అవకుండా కూడా తప్పించుకుంటున్నాడని విమర్శలున్నాయి.

ఇదిలావుంటే ఈమధ్య తనీష్‌కి ఏదీ కలిసి రావడం లేదు. ఫైనల్స్‌కి చేరుకుంటోన్న దశలో అతనికి దెబ్బ మీద దెబ్బ తగుల్తోంది. టీవీ9 దీప్తి భర్త వెళుతూ వెళుతూ ఫిజికల్‌ టాస్క్‌లలో చూసి ఆడండి అని ఇచ్చిన సలహా తనీష్‌కి గట్టిగానే తగిలింది. తన భార్యతో తనీష్‌ వ్యవహరిస్తోన్న తీరు నచ్చలేదని అతను చెప్పకనే చెప్పేసాడు. దాంతో ట్రోలర్స్‌కి తనీష్‌ ఆహారం అయ్యాడు. ఇదిలావుంటే అందరికీ కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎపిసోడ్‌ తనీష్‌కి మాత్రం చేటు చేసింది.

తనీష్‌ తమ్ముడు హౌస్‌లోకి వచ్చి కౌశల్‌ ఆటతీరుని నిలదీయడం విమర్శల పాలవుతోంది. ఆటకి సంబంధం లేని వ్యక్తి వచ్చి ఒక ప్లేయర్‌ని కార్నర్‌ చేయడం ఏమిటని అంతా తప్పుబడుతున్నారు. తమ్ముడి ఆటిట్యూడ్‌ కూడా అన్నయ్యలానే వుందని ట్రోల్స్‌ పేలుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం హౌస్‌లో వున్న వారిలో వీకెస్ట్‌ అయిపోయాడు తనీష్‌. ఫైనల్స్‌కి చేరుకున్నా సామ్రాట్‌ని కూడా అతను దాటలేడనే సంకేతాలు అందుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు