అక్కినేని వారి రాత మార్చేయాలనే ఆరాటం

అక్కినేని వారి రాత మార్చేయాలనే ఆరాటం

తన సినిమా విడుదలవుతున్నా కానీ భర్త సినిమా హిట్టయితేనే ఎక్కువ ఆనంద పడతానని సమంత పేర్కొనడం యుటర్న్‌ మేకర్స్‌ని కాస్త ఇబ్బంది పెడుతూ వుండొచ్చు. భార్యగా భర్తపై వున్న ప్రేమని సమంత అలా చాటుకుంటోంది. ఇద్దరి సినిమాలూ హిట్టవ్వాలని కోరుకోవడం లౌక్యం అయిపోతుంది. భర్త సినిమాకే ఎక్కువ మార్కులు పడాలని కోరుకోవడంలోనే సమంత ప్రేమ తెలుస్తోంది.

సమంతకి ఇండస్ట్రీలో గోల్డెన్‌ గాళ్‌గా పేరుంది. ఎక్కువ హిట్‌ సినిమాల్లో నటించిన సమంత చాలా మంది హీరోలకి కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్లు ఇచ్చింది. చైతన్యని పెళ్లి చేసుకుంటుందని తెలిసినపుడు అదృష్టలక్ష్మిని చేసుకుంటున్నాడని, ఇక చైతన్య పెద్ద స్టార్‌ అయిపోతాడని అనుకున్నారు. కానీ సమంతని చేసుకున్నాక కూడా చైతన్య కెరియర్లో చెప్పుకోతగ్గ మార్పులు రాలేదు.

ఈ నేపథ్యంలో చైతన్య సినిమాల ఎంపికలో, పూర్తయిన తర్వాత మార్పులలో కూడా సమంత జోక్యం ఎక్కువైందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తన వల్ల చైతన్యకి కలిసి వచ్చిందని, స్టార్‌ అయిపోయాడని అనిపించుకోవాలని సమంత ఎక్కువ ఆరాట పడుతోందట. అందుకే శైలజారెడ్డి అల్లుడు విజయం కోసం అంతగా తపించిపోతోందట. మరి ఈ సినిమాతో చైతన్య హీరోగా పెద్ద టర్న్‌ తీసుకుంటాడో లేదో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు