నటుడిగా మారిన మురుగదాస్

నటుడిగా మారిన మురుగదాస్

దక్షిణాది టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్ కొత్త అవతారంలోకి మారుతున్నాడు. ఇప్పటిదాకా తెర వెనుకే ఉన్న మురుగ.. త్వరలోనే తెర ముందుకు రాబోతున్నాడు. ఆయన నటుడిగా మారడం విశేషం. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘నోటా’లో మురుగదాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆనంద్ శంకర్.. మురుగ శిష్యుడే కావడం విశేషం. ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్‌ లాగా కనిపిస్తున్న ‘నోటా’లో తన గురువు కోసం ఒక ప్రత్యేక పాత్రను పెట్టాడట ఆనంద్. ఐతే అతి సామాన్యుడిలా కనిపించే మురుగదాస్ తెరపై ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరం. ఆయన్ని చూస్తే సినిమాలో కనిపించే ఫేస్ లాగా అయితే కనిపించదు. మురుగ సైతం ఆ రకమైన ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడు.

చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మురుగను నటనకు ఒప్పించి ఆయనతో ఒక పాత్ర చేయించడం విశేషమే. మరి అంత ప్రత్యేకత అందులో ఏముందో చూడాలి. మురుగదాస్ శిష్యుల్లో అందరి కంటే ఎక్కువ పేరు సంపాదించిన వాడు ఆనంద్ శంకరే. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘అరుమా నంబి’ అప్పట్లో సూపర్ హిట్టయింది. ఈ చిత్రం తెలుగులో ‘డైనమైట్’ పేరుతో రీమేక్ అయింది కూడా. కానీ ఇక్కడ ఆడలేదు. రెండో సినిమానే విక్రమ్ లాంటి బడా స్టార్‌తో చేసే అవకాశం దక్కించుకున్నాడు ఆనంద్. కానీ వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఇంకొక్కడు’ నిరాశ పరిచింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా ‘అర్జున్ రెడ్డి’తో తిరుగులేని పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ హీరోగా ‘నోటా’ మొదలుపెట్టాడు మురుగ. దీని ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది. అక్టోబరు 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు