దేవరకొండ ఈ కొండని దాటగలడా?

దేవరకొండ ఈ కొండని దాటగలడా?

విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఏమిటనేది వరుసగా రెండు చిత్రాలతో తెలిసి వచ్చినా కానీ అతని తదుపరి చిత్రం మాత్రం విజయ్‌ స్టామినాని పరీక్షించబోతోంది. ఇంతవరకు చేసిన సినిమాలకి భిన్నంగా ఈసారి సీరియస్‌ కాన్సెప్ట్‌తో లిమిటెడ్‌ అప్పీల్‌ వున్న నోటా చేస్తున్నాడు. పూర్తిగా విజయ్‌ ఇమేజ్‌ మీదే ఈ డబ్బింగ్‌ సినిమా డిపెండ్‌ అవుతుంది. అయితే యువత, ఫ్యామిలీస్‌ అండ లేకుండా దేవరకొండ ఎంత వరకు సక్సెస్‌ అవుతాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

దానికి తోడు గీత గోవిందంకి దక్కినట్టు నోటాకి ఫ్రీ గ్రౌండ్‌ దొరకడం లేదు. నోటా రిలీజ్‌ అయిన వారం రోజులకే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల 'అరవింద సమేత' రిలీజ్‌ అవుతుంది. అంత పెద్ద చిత్రం వచ్చిన తర్వాత నోటా లాంటి సీరియస్‌ చిత్రానికి ఆదరణ తగ్గే అవకాశాలే ఎక్కువ. ఈసారి విజయ్‌ దేవరకొండకి అన్ని విధాలా పరీక్ష ఎదురు కానుంది. గీత గోవిందం ఒట్టి ఫ్లూకేనా లేక విజయ్‌ చిత్రాల కోసం జనం అలాగే ఎగబడుతున్నారా అనేది నోటాతో తేలిపోతుంది.

అందుకే ఇది నటుడిగా అతనికి చాలా కీలక చిత్రం. గీత గోవిందం తర్వాత జాగ్రత్త పడి జనాలకి ఏమి కావాలో అది చేయవచ్చు కానీ, తానేమి చేసినా జనం చూస్తారా లేదా అనేది విజయ్‌కి తెలియడానికి నోటా బాగా దోహదపడుతుంది. అతని కెరియర్‌ ప్లానింగ్‌ పరంగా ఈ చిత్రం చాలా చాలా కీలకమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు