మహేష్‌ పొగిడాడు కానీ లాభం లేదు

మహేష్‌ పొగిడాడు కానీ లాభం లేదు

మహేష్‌ ఇంతకుముందు ఏ సినిమా గురించి అయినా సెలక్టివ్‌గా మాట్లాడేవాడు. విడుదలైన వాటిలో బాగున్నాయని టాక్‌ వచ్చిన అన్ని సినిమాలకీ మహేష్‌ కితాబులు ఇచ్చేవాడు కాదు. అలాంటి టైమ్‌లో తన బావమరిది సుధీర్‌ బాబు చిత్రాల గురించి మహేష్‌ బాగా మాట్లాడితే ఆ చిత్రానికి అది ప్లస్‌ అయ్యేది. కానీ ఈమధ్య మహేష్‌ అన్ని సినిమాలనీ పొగుడుతున్నాడు. డబ్బింగ్‌ చిత్రాలకి కూడా మహేష్‌ కితాబులు అందిస్తున్నాడు.

దీంతో మహేష్‌ ఆబ్లిగేషన్‌ వైజ్‌గా సుధీర్‌ చిత్రాలని పొగుడుతోంటే వాటికి పెద్దగా మైలేజ్‌ రావడం లేదు. సమ్మోహనం చిత్రం గురించి మహేష్‌ ఎంత గొప్పగా చెప్పినా ఫాన్స్‌ నుంచి కూడా తగిన స్పందన రాలేదు. అలాగే సుధీర్‌ నిర్మాతగా మారి తీసిన 'నన్ను దోచుకుందువటే' ట్రెయిలర్‌కి కూడా మహేష్‌ భలే పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చాడు.

అయితే దీని వల్ల ఈ చిత్రానికి వచ్చిన అడిషినల్‌ అడ్వాంటేజ్‌ ఏమీ లేదు. మిగతా సినిమాలకి మహేష్‌ ఏమీ ఆశించకుండానే పొగడ్తలు అందిస్తోంటే, బావమరిది చిత్రానికి మాత్రం ఆబ్లిగేషన్‌లోకి ఇలాంటి ట్వీట్లు వెళ్లిపోతున్నాయి. ఈ టైమ్‌లో మహేష్‌ తన సినిమాలన్నిటి గురించి మాట్లాడకుండా చాలా సెలక్టివ్‌గా పొగుడుతూ వుంటే బెటర్‌ అని సుధీర్‌ భావిస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు