సమంతని కార్నర్‌ చేస్తోన్న మహేష్‌ ఫాన్స్‌

సమంతని కార్నర్‌ చేస్తోన్న మహేష్‌ ఫాన్స్‌

హీరోల అభిమానులు దేనిని అంత తేలికగా మరచిపోరు. అందులోను తమ హీరో గురించి ఏదైనా బ్యాడ్‌ జరిగితే మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడో ఊసుపోక మహేష్‌ సినిమా '1 నేనొక్కడినే' పోస్టర్‌ గురించి చేసిన కామెంట్‌ ఆమెని ఇంకా వెంటాడుతోంది. మహేష్‌ నడుస్తోంటే వెనక కుక్కపిల్లలా పాకుతోన్న క్రితి సనన్‌ని చూసి సమంత 'రిగ్రెసివ్‌' అంటూ కామెంట్‌ చేసింది.

పోస్టర్‌ నచ్చకపోతే తనకే కాల్‌ చేసి చెప్పవచ్చుగా అని మహేష్‌ కూడా అన్నాడు. అప్పుడంటే అలా అనేసింది కానీ క్రియేటివ్‌ ఫీల్డులో ఇలాంటివి తమకే రివర్స్‌ అవుతుంటాయి. శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్య పాదాలని అను ఎమాన్యుయేల్‌ ముద్దాడే సీన్‌ వుంది.

అప్పుడు మహేష్‌ పోస్టర్‌ రిగ్రెసివ్‌ అయితే ఇప్పుడు నీ భర్త చేసేదేంటి అంటూ సమంతని మహేష్‌ ఫాన్స్‌ కార్నర్‌ చేస్తున్నారు. తనని అలా కంటిన్యూస్‌గా ట్రోల్‌ చేస్తున్నా కానీ సమంత మాత్రం ఇంతవరకు ఇదంతా తెలియనట్టే సైలెంట్‌గా వుంది. అయితే దీనిపై స్పందించకుండా వుంటే మాత్రం ఫాన్స్‌ వదిలిపెట్టరు కనుక దీని గురించి సమంత ఏదో ఒకటి అనక తప్పదు. మరి భర్తని నొప్పించకుండా, ఒకప్పటి తన స్టేట్‌మెంట్‌ తప్పు అని ఒప్పుకోకుండా దీనిని సమంత ఎలా దాట వేస్తుందనేది ఆసక్తికరమే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English