అరవింద సమేత ఫుల్‌ ప్యాకేజ్‌.. ఇన్‌స్టాల్‌మెంట్స్‌ లేవు

అరవింద సమేత ఫుల్‌ ప్యాకేజ్‌.. ఇన్‌స్టాల్‌మెంట్స్‌ లేవు

ఈమధ్య ఆడియోని ఒకేసారి విడుదల చేయకుండా ఒక్కొక్క పాట చొప్పున విడుదల చేయడం ట్రెండ్‌ అయింది. చిన్న లేదు, పెద్ద లేదు... అన్ని సినిమాలకీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150'తో ఊపందుకున్న ఈ ట్రెండ్‌ ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయింది. అయితే ఇలా ఒక్కొక్క పాట విడుదల చేయడం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెడుతోంది.

ఆడియోలో అన్ని పాటలు బాగుండాలనే రూల్‌ లేదు కాబట్టి రిలీజ్‌ చేసిన పాటల్లో ఏదైనా ఒకటి అంచనాలని అందుకోలేకపోతే అనవసరంగా నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. అందుకే ఈ తలనొప్పి అంతా దేనికని 'అరవింద సమేత'కి మాత్రం సాంప్రదాయ పద్ధతిలో అన్ని పాటలు ఒకేసారి ప్యాకేజ్‌గా విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు.

అయితే ఆడియో సింగిల్స్‌ వల్ల వచ్చే అదనపు పబ్లిసిటీని, నిత్యం వార్తల్లో వుండే అవకాశాన్ని ఈ చిత్రం మిస్‌ కావచ్చు. ఇదిలావుంటే ఈ చిత్రానికి ఆడియో రిలీజ్‌ వేడుక కూడా ఏమీ చేయడం లేదట. డైరెక్టుగా ఆడియోని మార్కెట్లోకి వదిలేసి, విడుదలకి వారం ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయాలని భావిస్తున్నారట. విడుదలకి సరిగ్గా నెల రోజుల సమయమే వున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు