కంగన దెబ్బకు ఇంకో వికెట్

కంగన దెబ్బకు ఇంకో వికెట్

ఝాన్సీ లక్ష్మీబాయి కథతో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ సినిమాతో మన క్రిష్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం నుంచి అవమానకర రీతిలో బయటికి వచ్చేశాడు క్రిష్. సినిమా మేకింగ్‌లో హీరోయిన్ కంగనా రనౌత్ అతి జోక్యమే ఇందుకు కారణమన్నది స్పష్టం. ఇంతకుముందు క్రిష్ తీసిన చాలా సన్నివేశాల్ని పక్కన పెట్టి స్వీయ దర్శకత్వంలో కొత్త సన్నివేశాలు తీసుకుంటోంది కంగన. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా బయటికి వచ్చాయి. ఈ సినిమా గురించి పట్టించుకోకుండా క్రిష్ ‘యన్.టి.ఆర్’ మొదలుపెట్టేసి అందులో మునిగిపోయాడు. ఇంతలో ఈ చిత్రం నుంచి నటుడు సోనూ సూద్ తప్పుకుంటున్న సంగతి వెల్లడైంది. దానికి సంబంధించిన వివాదం కొన్ని రోజుల పాటు మీడియాలో హల్ చల్ చేసింది.

ఆ గొడవ ఇలా సద్దుమణిగిందో లేదో.. ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రానికి సంబంధించిన మరో సంచలన అప్ డేట్ వెలుగుచూసింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజయ్ కుట్టి ఈ ప్రాజెక్టు నుంచి అర్ధంతరంగా వైదొలిగినట్లు సమాచారం. ‘మణికర్ణిక’ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ హెడ్ అతను. కంగనతో గొడవ వల్లే ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ముందు ఈ చిత్రాన్ని రూ.70 కోట్లలో పూర్తి చేయాలని భావించగా.. రీషూట్ల వల్ల అదనంగా 30 కోట్లు ఖర్చయిందట. ఈ బడ్జెట్‌తో సినిమా వర్కవుట్ కాదని సంజయ్ తేల్చి చెప్పాడట. రీషూట్లు జరగడానికి ముందే అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాతో అతడికి ఉన్న ఫినాన్షియల్ డీల్స్ సంగతేంటో తెలియాల్సి ఉంది. ఇలా వరుసగా ‘మణికర్ణిక’కు సంబంధించి నెగెటివ్ న్యూసే బయటికి వస్తుండటంతో ఈ సినిమా ఫలితంపై సందేహాలు కలుగుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు