అజ్ఞాతవాసితో త్రివిక్రమ్‌ ఏమీ మారలేదు

అజ్ఞాతవాసితో త్రివిక్రమ్‌ ఏమీ మారలేదు

త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసే ఏ స్టార్‌ హీరో సినిమాకి అయినా వంద కోట్ల బిజినెస్‌ అవలీలగా జరిగిపోతుంది. అజ్ఞాతవాసి అంతటి భారీ పరాజయం తర్వాత కూడా అతను తీస్తోన్న అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి వంద కోట్ల బిజినెస్‌ అయింది. అయితే తన సినిమాలకి ఎంత బిజినెస్‌ జరిగినా కానీ నిర్మాతకి మాత్రం ఎక్కువ మిగలదని, ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాడని త్రివిక్రమ్‌పై ఒక అపవాదు వుంది.

అజ్ఞాతవాసి చిత్రానికి పారితోషికంలో కాస్త వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఈసారి ఖర్చు విషయంలో జాగ్రత్త పడతాడని అనుకున్నారు కానీ షరా మామూలుగా 'అరవింద సమేత'కి కూడా వేస్టేజీ బాగా జరుగుతోంది. ఆన్‌ ది స్పాట్‌లో బెటర్‌మెంట్స్‌ చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌పై, సెట్‌ ప్రాపర్టీస్‌పై లక్షలకి లక్షలు ఖర్చు చేయించడం త్రివిక్రమ్‌కి బాగా అలవాటు. అరవింద సమేతకి కూడా ఇలాంటి అదనపు ఖర్చు ఘనంగానే జరుగుతోందట.

తారక్‌, త్రివిక్రమ్‌ ఇద్దరి పారితోషికాలతో కలుపుకుని ఈ చిత్ర నిర్మాణ వ్యయమే వంద కోట్లకి తక్కువ అవదని, థియేట్రికల్‌ బిజినెస్‌ ద్వారా వచ్చేది కేవలం ఖర్చులకే పోతుందని, శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారా వచ్చేదాంట్లోనే నిర్మాతకి మిగులుతుందని చెబుతున్నారు. భారీ నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్‌ వున్న చిత్రాలకి అంత ఖర్చయితే ఓకే కానీ సాధారణ ఫ్యామిలీ సినిమాలకి కూడా త్రివిక్రమ్‌ అదే స్థాయిలో ఖర్చు పెట్టించేయడమే నిర్మాతకి తలపోటు. అన్నీ కలిసి వచ్చినపుడు ఫర్వాలేదు కానీ అజ్ఞాతవాసిలా రివర్స్‌ అయితేనే నిర్మాత జేబుకి చిల్లు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English