రంగస్థలంకి ఆ దమ్ముంది!

రంగస్థలంకి ఆ దమ్ముంది!

మగధీర జపాన్‌లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఎప్పుడో ముత్తు సినిమా నెలకొల్పిన రికార్డుని బాహుబలి 2 కూడా బ్రేక్‌ చేయలేకపోయింది. బాహుబలి 2 చిత్రం జపాన్‌లో వైరల్‌ అయినా కానీ వసూళ్ల పరంగా ముత్తుని దాటడంలో విఫలమైంది.

కానీ రాజమౌళి డైరెక్ట్‌ చేసిన మగధీరకి మాత్రం ఇప్పటికే రెండు మిలియన్‌ డాలర్లకి పైగా వసూళ్లు వచ్చాయి. జపాన్‌లో ఈ చిత్రానికి దక్కుతోన్న ఆదరణకి రామ్‌ చరణ్‌ కూడా జపాన్‌ ఆడియన్స్‌కి కృతజ్ఞతలు చెప్పాడు. అతను నటించిన రంగస్థలం చిత్రానికి చైనాలో మంచి వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. చైనాలో మన ఎమోషనల్‌ కథలకి మంచి ఆదరణ వుందని దంగల్‌, బజరంగి భాయ్‌జాన్‌, లిటిల్‌ సూపర్‌స్టార్‌లాంటి చిత్రాలు నిరూపించాయి.

రంగస్థలం ఇదే కోవకి చెందిన చిత్రం కనుక చైనాలో విడుదల చేయడం కోసం చరణ్‌ తరఫునుంచి కృషి చేస్తే మంచి ఫలితం వుంటుంది. రంగస్థలం ఎమోషనల్‌గా చైనీయులకి కనక్ట్‌ అవడానికి అవకాశాలు ఎక్కువ వున్నాయి. అన్నీ కుదిరితే కనుక ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లు తెచ్చుకోగలుగుతుంది. కేవలం బాలీవుడ్‌ వాళ్లు మాత్రమే చైనా మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు కానీ వారి ఎమోషన్స్‌కి తగ్గ చిత్రాలు దక్షిణాదిలోనే ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. ముందుగా ఎవరు చొరవ చేస్తారో కానీ ఒక్కసారి గేట్లు తెరుచుకుంటే యుఎస్‌ మాదిరిగా చైనా కూడా తెలుగు సినిమాలకి మంచి మార్కెట్‌గా అవతరిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English