దిల్‌ రాజు డ్యామేజ్‌ కంట్రోల్‌

దిల్‌ రాజు డ్యామేజ్‌ కంట్రోల్‌

దిల్‌ రాజు బ్రాండ్‌ వేల్యూకి 'శ్రీనివాస కళ్యాణం' పరాజయం పెద్ద హోలే పెట్టింది. అంతకుముందు వరకు మార్మోగిన రాజు పేరు 'లవర్‌', 'శ్రీనివాస కళ్యాణం' పరాజయాలతో పూర్తిగా మరుగున పడింది. దిల్‌ రాజుకి ఏదో సక్సెస్‌ తంత్రం తెలుసునని, హిట్‌ మెషీన్‌ అనీ అన్నవాళ్లే అతడికి కూడా ఫ్లాపులు మామూలేనని, కాలం కలిసొచ్చి సక్సెస్‌ అయ్యాడని అంటున్నారు.

అంతే కాకుండా పరాజయాలకి బ్రేక్‌ వేయడం కోసం తదుపరి చిత్రాలపై అమిత శ్రద్ధ వహిస్తున్నాడని కూడా అతడిపై ప్రచారం జరుగుతోంది. దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి వస్తోన్న 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రానికి రీషూట్లు జరుగుతున్నాయనే టాక్‌ స్ప్రెడ్‌ అయింది. దీంతో డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం అలాంటిది ఏమీ లేదని తమకి అనుకూల మీడియా ద్వారా డిఫెండ్‌ చేసుకుంటున్నారు. రీషూట్‌ అంటే దిల్‌ రాజు ఎందుకు ఇంతగా భుజాలు తడుముకుంటున్నాడనేది అతడిని చూస్తూ వున్న వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. రీషూట్‌ అనేదానిని ఒక సినిమా షూటింగ్‌లో ప్రాసెస్‌గా మాత్రమే భావించే దిల్‌ రాజు తన సినిమాలకి రీషూట్స్‌ చేశామని గర్వంగా చెప్పుకుంటూ వుంటాడు.

కానీ ఇప్పుడు దానిని వీక్‌నెస్‌గా పరిగణిస్తూ కంగారు పడుతున్నాడు. అసలే డౌన్‌లో వున్నపుడు రీషూట్లు అని ప్రచారం జరిగితే మరింత డ్యామేజ్‌ అవుతుందని దిల్‌ రాజు వర్రీ అవుతున్నాడా? కారణం ఏదైనా కానీ వరుసగా రెండు ఫ్లాప్స్‌తో దిల్‌ రాజు కాన్ఫిడెన్స్‌ షేక్‌ అయిందనే సంకేతాలు మాత్రం బలంగానే అందుతున్నాయి. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు