అన్నీ వున్నా బామ్మర్ది నోట్లో...!

అన్నీ వున్నా బామ్మర్ది నోట్లో...!

నటుడిగా మొదటి సినిమాకీ, ఇప్పటికీ మహేష్‌ బావమరిది సుధీర్‌ బాబు చాలా పరిణితి సాధించాడు. తనకి ఎలాంటి కథలు సూట్‌ అవుతాయనేది రియలైజ్‌ అయి, సిక్స్‌ ప్యాక్‌ బాడీని చొక్కాలోనే దాచేసి క్లాస్‌ సినిమాలు చేస్తున్నాడు. కథలు ఎంచుకోవడంలో, తనని తాను గ్రూమ్‌ చేసుకోవడంలో అన్నిట్లోను సుధీర్‌ చాలా మంది హీరోల కంటే మెరుగ్గా వున్నాడు. మహేష్‌ అతనికి ఎలాంటి సలహాలు, సంప్రదింపులు, మాట సాయాలు చేయకపోయినా కానీ సుధీర్‌ నటుడిగా పేరు తెచ్చుకోగలిగాడు.

తాజాగా 'నన్ను దోచుకుందువటే'తో నిర్మాతగా కూడా మారాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ సుధీర్‌కి ఎందుకో కాలం కలిసి రావడం లేదు. మిగతా యువ హీరోలకి వచ్చినట్టు కెరియర్‌ టర్నింగ్‌ సినిమాలు అతనికి రావడం లేదు. తనలా కష్టపడ్డ ప్రతి హీరోకీ దశ తిరిగింది. నాని, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, శర్వానంద్‌ ఇలా అందరికీ మంచి హిట్లు పడ్డాయి. హిట్‌ టాక్‌ వచ్చిన సమ్మోహనం కూడా అంతంత మాత్రంగానే ఆడింది.

ఈ నేపథ్యంలో 'నన్ను దోచుకుందువటే' సుధీర్‌కి కీలకంగా మారింది. ఇది జస్ట్‌ బాగుందని టాక్‌ తెచ్చుకుని యావరేజ్‌ వసూళ్లు తెచ్చుకుంటే మాత్రం సరిపోదు. కెరియర్‌ టర్న్‌ చేసే రీతిన ఘన విజయాన్ని ఈ చిత్రంతో అందుకోలేకపోతే సుధీర్‌ని ట్రేడ్‌ సీరియస్‌గా తీసుకునే అవకాశముండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు