డెబ్బయ్‌ కోట్లలో డైరెక్టర్‌కి జీరో

డెబ్బయ్‌ కోట్లలో డైరెక్టర్‌కి జీరో

'గీత గోవిందం' ఫుల్‌ రన్‌లో డెబ్బయ్‌ కోట్ల షేర్‌ సాధిస్తుందని ట్రేడ్‌ చెబుతోంది. ఇప్పటికే అరవై ఏడు కోట్ల వరకు వసూలయ్యాయి కనుక యాభై రోజులు పూర్తి చేసుకునే లోగా డెబ్బయ్‌ కోట్లు రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదనే అనిపిస్తోంది.

ఈ చిత్రానికి పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకున్న దర్శకుడు పరశురాంకి ఆర్థికంగా ఇది బాగా హెల్ప్‌ అయింది. అయితే ఇంత ఘన విజయం సాధించిన చిత్రానికి దర్శకుడికి వస్తోన్న క్రెడిట్‌ ఏమీ లేకపోవడమే విచిత్రంగా వుంది. సాధారణంగా ఏదైనా సినిమా ఇంతటి పెద్ద హిట్‌ అయితే దర్శకుడి పాత్ర ఖచ్చితంగా వుంటుంది. కానీ పరశురాంకి మాత్రం ఇండస్ట్రీలో ఎవరూ అంతగా క్రెడిట్‌ ఇవ్వడం లేదు.

అతను తీసింది ఒక సాధారణ సినిమాయేనని, విజయ్‌ దేవరకొండ కారణంగా జనం కనక్ట్‌ అవడం వల్ల ఇంత రేంజ్‌ వచ్చిందని, అంచేత మరో పెద్ద హిట్‌ ఇస్తే తప్ప పరశురాంని ఎక్కువ అంచనా వేయాల్సిన పని లేదని అంటున్నారు. ఇందుకు తగ్గట్టే పరశురాంకి పెద్ద హీరోల డేట్లు కూడా దొరకడం లేదు. ఇంత భారీ హిట్‌ ఇచ్చాక కూడా ఏమాత్రం ఎఫెక్ట్‌ వేయలేకపోయిన వాడిగా పరశురాంకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు