2.0 ఇన్ని కోట్ల రిస్క్‌ అవసరమా?

2.0 ఇన్ని కోట్ల రిస్క్‌ అవసరమా?

రజనీ, శంకర్‌ల 2.0 ఎలా వుండబోతుందనేది మరో రెండు రోజుల్లో ఐడియా వస్తుంది. ఈ చిత్రం టీజర్‌ని వినాయకచవితికి విడుదల చేస్తున్నారు. ఆడియో రిలీజ్‌ అయి ఏడాది కావస్తున్నా కానీ దాని వల్ల సినిమాపై ఎలాంటి అంచనాకి రాలేకపోయారు. టీజర్‌ చూస్తే సినిమా స్కేల్‌ తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ హక్కులు తీసుకున్న నిర్మాతలకి లైకా వాళ్లు అమౌంట్‌ తిరిగి ఇచ్చేసారనే ప్రచారం జరుగుతోంది.

ఎనభై కోట్ల రేంజిలో రైట్స్‌ తీసుకోవడానికి ఏషియన్‌ సినిమాస్‌ ఒప్పందం చేసుకుంది. ఇందు నిమిత్తం ఇరవై కోట్ల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారనే టాక్‌ వుంది. అయితే డీల్‌ కాన్సిల్‌ చేసుకున్నారని, తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగిన నేపథ్యంలో ఈ చిత్రానికి వంద కోట్ల పైగా షేర్‌ వస్తుందని లైకా వాళ్లు అంచనా వేస్తున్నారట. అందుకే డీల్‌ కాన్సిల్‌ చేసుకున్నారట. అది నిజమే అయి వుండొచ్చు కానీ ఇరవై కోట్ల డిఫరెన్స్‌ కోసం ఇన్ని కోట్ల రిస్క్‌ అవసరమా అనేది ట్రేడ్‌ మాట.

ముఖ్యంగా ఇంత భారీ చిత్రానికి ఎక్కువ థియేటర్లు అవసరం అవుతాయి. పెద్ద నిర్మాత చేతుల్లో పెడితే రిలీజ్‌ ప్రోపర్‌గా వుండేట్టు చూసుకుంటాడు. కానీ ఇలా లైకా ఓన్‌ రిలీజ్‌కి వెళితే మాత్రం థియేటర్ల పరంగా ఇబ్బంది ఎదురు కావచ్చు. ఈ పాయింట్‌ ఆలోచించి లైకా తమ ఆలోచన మానుకుంటారో లేక రిస్కుకే సిద్ధమంటారో కొద్ది రోజుల్లో తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English