సాహో ఇంకా ఒక దారికి రాలేదు

సాహో ఇంకా ఒక దారికి రాలేదు

ప్రభాస్‌ ఫాన్స్‌ ఏమో ఎప్పుడెప్పుడు రెబల్‌స్టార్‌ని వెండితెరపై చూద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ సాహో షూటింగ్‌ మాత్రం ఒక పట్టాన తెమలడం లేదు. ఈ చిత్రం ఇంకా ఒక దారికి రాలేదని, ఎన్నాళ్లు జరుగుతుందనేది కూడా ఐడియా లేదని స్వయంగా హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ చెప్పింది. ఒక సినిమాలో హీరోయిన్‌ రోల్‌ తక్కువ. అలాంటిది హీరోయిన్‌ పార్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందనేది ఇంకా తేలలేదంటే ఇంకా ఎంత షూటింగ్‌ పార్ట్‌ బ్యాలెన్స్‌ వుందనేది అర్థమవుతోంది.

ఎన్నో బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన శ్రద్ధ ఈ చిత్రానికి షూటింగ్‌ చేస్తూ ఒకేసారి రెండు సినిమాలు చేస్తోన్న భావన కలుగుతోందని చెప్పింది. అంటే ఎంత భారీగా, ఎంతటి హార్డ్‌వర్క్‌ అవసరం పడుతోందనేది ఆమె మాటల్లోనే తెలుస్తోంది. ఇదిలావుంటే సాహో షూటింగ్‌ ఇంకా చాలా సమయం పడుతుందనేది అర్థం కావడం వల్లే రాధాకృష్ణ కుమార్‌ చిత్రాన్ని ప్రభాస్‌ మొదలు పెట్టాడట. సాహోకి షూటింగ్‌ గ్యాప్స్‌ ఎక్కువ వుంటున్నాయి కనుక గ్యాప్‌ దొరికినపుడల్లా ఆ చిత్రం పూర్తి చేస్తాడట.

సాహో ప్రస్తుతం జరుగుతోన్న వేగానికి సమ్మర్‌కి పూర్తయి రావడం కూడా అనుమానమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే యేడాది ఈ సమయానికి సాహో రిలీజ్‌ కావచ్చునేమో అంటున్నారు. మరి ఏ సంగతీ దర్శకుడు సుజిత్‌ లేదా హీరో ప్రభాస్‌ క్లారిఫై చేయాలి.