బాహుబలిని దాటించేసారుగా!

బాహుబలిని దాటించేసారుగా!

బాహుబలి రెండు భాగాలు చిత్రీకరించడానికి నాలుగు వందల యాభై కోట్ల వ్యయం అయినట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కిన బాహుబలిని దాటేసామని '2.0' నిర్మాతలు చెప్పుకుంటున్నారు.

దాదాపు అయిదు గంటల నిడివి వున్న చిత్రానికి నాలుగు వందల యాభై కోట్లు అయితే, గంటన్నర నిడివి మాత్రమే వున్న శంకర్‌ చిత్రానికి డెబ్బయ్‌ అయిదు మిలియన్‌ డాలర్లు ఖర్చయినట్టు నిర్మాతలు పేర్కొన్నారు. అంటే ఇండియన్‌ కరన్సీలో అయిదు వందల పాతిక కోట్లకి పైగా ఖర్చు అయిందని నిర్మాతలు చెబుతున్నారు.

మరి నిజంగానే ఈ చిత్రానికి ఇంత ఖర్చు అయిందో లేదో తెలియదు కానీ చాలా సమయం, డబ్బు మాత్రం వృధా అయ్యాయి. ఒక కంపెనీకి ఇచ్చిన గ్రాఫిక్స్‌ కాంట్రాక్ట్‌ని పూర్తి చేయకముందే ఆ కంపెనీ దివాలా తీయడంతో అప్పటి వర్క్‌ మొత్తం వదిలేసుకుని వేరే కంపెనీలకి కాంట్రాక్ట్‌ ఇచ్చి పూర్తి చేసారు. దీని వల్ల చాలా సమయం వేస్ట్‌ అయింది. ఎన్ని నెలలు ఆలస్యమైతే అన్నాళ్లు వడ్డీలు కూడా అవుతాయి.

మరి ఈ వడ్డీలన్నీ వేసుకుని ఇంత వ్యయం అయిందని చెబుతున్నారా లేక సినిమా తీయడానికే ఇందులో చాలా భాగం ఖర్చు పెట్టారా అనేది వారికే తెలియాలి. ఏదేమైనా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రమనే పబ్లిసిటీ మాత్రం ఘనంగా జరుగుతోంది. మరి బాహుబలి చిత్రం సాధించిన విజయాన్ని మించిన విజయాన్ని ఈ రజనీకాంత్‌-అక్షయ్‌కుమార్‌ల సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English