సమంతకి నాలుగు రెట్లు.. చైతన్య రేంజ్‌!

సమంతకి నాలుగు రెట్లు.. చైతన్య రేంజ్‌!

ఒకే రోజున భార్యాభర్తల సినిమాలు విడుదల కావడం ఆసక్తికరమైంది. చైతన్య నటించిన మారుతి చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'తో పాటు సమంత ప్రధాన పాత్ర చేసిన 'యుటర్న్‌' కూడా వినాయక చవితి రోజునే విడుదలవుతున్నాయి. 'యు టర్న్‌' పూర్తిగా ఏ సెంటర్స్‌, మల్టీప్లెక్స్‌ చిత్రం కావడం, 'శైలజారెడ్డి అల్లుడు' యూనివర్సల్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఇవి ఒక దానికి మరొకటి పోటీ కావని మేకర్స్‌ అంచనా వేస్తున్నారు.

సమంత చిత్రం ఆరు కోట్ల రేంజిలో అమ్ముడుపోగా, చైతన్య చిత్రం దానికి నాలుగు రెట్లు పైగా బిజినెస్‌ చేసింది. దాదాపు పాతిక కోట్ల రేంజిలో 'శైలజారెడ్డి అల్లుడు' బిజినెస్‌ జరిగింది. ఒక్క నైజాం హక్కులతోనే 'యు టర్న్‌' ఓవరాల్‌ బిజినెస్‌ని చైతన్య సినిమా దాటేసింది. రెండు చిత్రాల మధ్య బిజినెస్‌ పరంగా, రేంజ్‌ పరంగా చాలా డిఫరెన్స్‌ వుండడంతో ఒకే రోజు విడుదల కావడం వల్ల అంత నష్టమేమీ వుండదని భావిస్తున్నారు.

రెండు సినిమాలు చూడమని అభిమానులకి సమంత, చైతన్య పిలుపు ఇచ్చారు కానీ మొదటి రోజు అడ్వాంటేజ్‌ దేనికి వుంటుందనేది ఆసక్తికరమే. పెళ్లి తర్వాత సమంత టైమ్‌ బాగా నడుస్తోంది కనుక 'యు టర్న్‌' కూడా పెద్ద హిట్‌ అవుతుందని ఆ చిత్ర నిర్మాతలు నమ్ముతున్నారు. మరోవైపు చైతన్యకి 'శైలజారెడ్డి అల్లుడు' ఫలితం చాలా కీలకం.

ఇప్పటికే పోటీ హీరోలకి తగ్గట్టు తన మార్కెట్‌ పెంచుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. కనుక వినాయక చవితి అడ్వాంటేజ్‌ వాడుకుని మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు కోట్ల షేర్‌ రాబడితే వీకెండ్‌ మీద భరోసా పెరుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు