తమన్నా మళ్లీ మెరిసిపోతోందోచ్‌

తమన్నా మళ్లీ మెరిసిపోతోందోచ్‌

'బాహుబలి' తర్వాత తమన్నా జోరు కొద్ది కాలం తగ్గింది. బాహుబలితో తన రేంజ్‌ బాగా పెరిగిందని అంచనా వేసుకున్న తమన్నా అందుకు తగ్గట్టే పారితోషికం బాగా పెంచేసింది. దాంతో ఆమెని తెలుగు, తమిళ చిత్రాలు పక్కన పెట్టేసాయి. ఈలోగా తమన్నా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో ఆమె మార్కెట్‌ మరింత పడిపోయింది.

దీంతో వాస్తవం రియలైజ్‌ అయిందో ఏమో ఇక తమన్నా తన పారితోషికం సగానికి తగ్గించేసుకుంది. ఫలానా హీరోతోనే నటిస్తానంటూ ఆంక్షలు కూడా పెట్టకుండా వచ్చిన అవకాశాలన్నీ వాడుకుంటోంది. ఈ మార్పుతో తమన్నా టైమ్‌ మళ్ళీ స్టార్ట్‌ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకు తెలుగు, తమిళ చిత్రాలున్నాయి.

చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో ఒక కీలక పాత్ర కూడా దక్కించుకుంది. క్వీన్‌ తెలుగు, తమిళ రీమేక్‌ అయిన 'దటీజ్‌ మహాలక్ష్మి'లో నటిస్తోంది. ఇటీవలే విశాల్‌ కొత్త సినిమాలో సుందర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా సైన్‌ చేసింది. వెంకటేష్‌ సరసన 'ఎఫ్‌ 2'లో నటిస్తోన్న తమన్నా 'కన్నే కళైమానే' అనే తమిళ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో నటిస్తోంది.

ఇవి కాకుండా ఒక రెండు సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌లోను నటిస్తూ తమన్నా రెండు చేతులా గడిస్తోంది. ఈ చిత్రాల్లో రెండు, మూడు హిట్‌ అయినా తన కెరియర్‌ మరో రెండు, మూడేళ్లు ఎక్స్‌టెండ్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు