దేవరకొండ నిర్మాతలకి ఆశ ఎక్కువైంది

దేవరకొండ నిర్మాతలకి ఆశ ఎక్కువైంది

విజయ్‌ దేవరకొండకి ఇప్పుడు యూత్‌లో పిచ్చ ఫాలోయింగ్‌ వుందనేది ఒప్పుకుని తీరాలి. అలా అని అతను చేసిన సినిమాలన్నీ 'గీత గోవిందం' రేంజ్‌ సక్సెస్‌ అవుతాయని అనుకోవడానికి లేదు. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి నచ్చే తరహా చిత్రాలకి అయితే భారీ వసూళ్లు ఖాయం చేసుకోవచ్చు కానీ అతను చేసిన సీరియస్‌ సినిమాలు కూడా అలాగే ఆడతాయని అనుకోవడం అవివేకం అవుతుంది.

ఉదాహరణకి 'నోటా' చిత్రాన్ని తీసుకుంటే రాజకీయ నేపథ్యంలో సాగే సీరియస్‌ డ్రామా అనేది స్పష్టం. పైగా తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. ఈ సినిమా వాలకం మరీ అరవమేళంలా వుందనే కామెంట్లు పడుతున్నాయి. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం తరహాలో దీనికి భారీ వసూళ్లు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది.

అయితే విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి సదరు తమిళ నిర్మాతలు దీని తెలుగు హక్కులకి ముప్పయ్‌ కోట్లకి పైగా అడుగుతున్నారు. నోటాకి ఇరవై కోట్లు ఇవ్వడానికి పలువురు సిద్ధంగా వున్నారు. పాతిక కోట్ల వరకు రిస్కు చేయడానికి కూడా కొందరు సిద్ధపడవచ్చు. కానీ ముప్పయ్‌ కోట్లకి పైగా రేటు కేవలం థియేట్రికల్‌ రైట్స్‌కి అనేది కాస్త టూమచ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు