నానిని వెంటాడుతోన్న కౌశల్‌ ఆర్మీ

నానిని వెంటాడుతోన్న కౌశల్‌ ఆర్మీ

ఏ ముహూర్తాన బిగ్‌బాస్‌కి హోస్టింగ్‌ చేస్తానని కమిట్‌ అయ్యాడో కానీ అది 'నేచురల్‌ స్టార్‌' నాని పాలిట ఇబ్బందికర నిర్ణయంగా మారింది. మొదట్లో ఉత్సాహంగా హోస్టింగ్‌ చేసిన నానికి రాన్రానూ షో మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. గత రెండు వారాలుగా అతని యాంకరింగ్‌ చూసిన వారికి ఎంత మొక్కుబడిగా ఇది చేస్తున్నాడనేది క్లియర్‌ అవుతోంది.

బయాస్డ్‌గా హోస్టింగ్‌ చేస్తున్నాడని, హౌస్‌లో కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ మిగతా వాళ్లని కార్నర్‌ చేస్తున్నాడని నానిపై ఆరోపణలున్నాయి. ఎన్నిసార్లు తాను బయాస్డ్‌ కాదని చెప్పుకున్నా కానీ నానిపై నిందలు తప్పడం లేదు. ఇంతకాలం సోషల్‌ మీడియాకే పరిమితం అయిన ట్రోలింగ్‌ నానిని పబ్లిక్‌ వేదికలపై కూడా ఇబ్బంది పెడుతోంది.

'శైలజారెడ్డి అల్లుడు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అతిథిగా వెళ్లిన నాని మాట్లాడుతుండగా 'కౌశల్‌' నినాదాలతో ఆడిటోరియం మిన్నంటంది. బిగ్‌ బాస్‌ షో చూడని వారికి కౌశల్‌ ఎవరనేది అంతు చిక్కలేదు. నానికి కూడా ఎలా స్పందించాలో తెలియక 'థాంక్స్‌ రా బాబూ... థాంక్స్‌' అంటూ రియాక్ట్‌ అయ్యాడు.

కౌశల్‌కి వున్న ఫాలోయింగ్‌ అల్లాటప్పా కాదని '2కె రన్‌' ద్వారా బోధపడే వుంటుంది కనుక దీనిని లైట్‌ తీసుకోవడానికి లేదు. పబ్లిక్‌ కోరికకి భిన్నమైన రిజల్ట్‌ వస్తే మాత్రం నానికి ఈ ట్రోలింగ్‌ ఎఫెక్ట్‌ తన సినిమాలపై కూడా పడే అవకాశం వుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు