డిమాండ్ చేయాలే కానీ నెల‌లో స‌న్న‌బ‌డుతుంద‌ట‌

డిమాండ్ చేయాలే కానీ నెల‌లో స‌న్న‌బ‌డుతుంద‌ట‌

ముద్దు గుమ్మ అంటారు. కానీ.. మ‌ల‌యాళీ భామ నిత్యా మీన‌న్ ను మాత్రం బొద్దుగుమ్మ‌గా అభివ‌ర్ణించే వారెంద‌రో. హీరోయిన్ అంటే.. స‌న్న‌జాజి మొగ్గ‌లా.. ఫ‌లానా షేపుల్లో.. ఫిక్సెడ్ ఒంపుసొంపుల‌తో ఉండాల‌న్న రూల్ ను బ్రేక్ చేసిన బ్యూటీ నిత్యా మీన‌న్‌.

రోటీన్ ను భిన్నంగా ఉండే ఈ భామ పొట్టిత‌నం గురించి..బొద్దుత‌నం గురించి చాలానే మాట‌లు వినిపిస్తూ ఉంటాయి. ఎత్తు త‌క్కువ‌.. లావుగా ఉంద‌న్న మాట‌ను మామూలోళ్ల‌ను అంటేనే ఫీల‌య్యే పరిస్థితి. అలాంటిది గ్లామ‌ర్ ఫీల్డ్ లో అలాంటి కామెంట్స్ ను ఎదుర్కోవ‌టం మామూలు విష‌యం కాదు.

కానీ.. అలాంటివేమీ త‌న‌ను ఏమీ చేయ‌లేవ‌ని చెబుతోంది నిత్యా మీన‌న్. అంతేకాదు.. లావుగా ఉన్నారు.. పొట్టిగా ఉన్నార‌న్న మాట‌ల్ని తానుఅస్స‌లు ప‌ట్టించుకోన‌ని.. అలాంటి ఫీలింగ్ త‌న‌కు అస్స‌లు క‌ల‌గ‌ద‌ని చెప్పింది. ఆత్మ‌విశ్వాసంతో ఉంటాన‌ని.. త‌న గురించి తానుచాలా గొప్ప‌గానే ఆలోచిస్తాన‌ని పేర్కొంది.

లావ‌య్యాన‌ని.. పొట్టిగా ఉంటాన‌ని విమ‌ర్శించే వారిని చూస్తే త‌న‌కు న‌వ్వు వ‌స్తుంద‌న్న నిత్య‌.. న‌ట‌న అన్న‌ది లైఫ్ లో ఒక భాగ‌మే త‌ప్పించి.. వేరే అంశాలు చాలా ఉంటాయ‌న్న నిజ‌మ‌ని చెప్పింది.

లావు.. స‌న్న‌బ‌డ‌టం లాంటివి త‌న‌కు సంబంధించి చాలా చిన్న విష‌యాలుగా చెప్పింది నిత్యం. అలాంటి మాట‌ల్ని తాను చాలా సింఫుల్ గా తీసుకుంటాన‌ని.. అస్స‌లు ఒత్తిడికి లోన‌వ్వ‌న‌ని చెబుతోంది. వేరే అంశాల మీద దృష్టి పెట్ట‌టం తో స‌న్న‌బ‌డ‌టం గురించి ఆలోచించ‌టం లేద‌ని.. తాను చేయ‌బోయే సినిమాల్లో పాత్ర కానీ స‌న్న‌గా ఉండాల‌ని డిమాండ్ చేస్తే.. నెల రోజుల్లో స‌న్న‌బ‌డిపోతాన‌ని పేర్కొంది నిత్యా. సో.. నిత్య‌ను స‌న్న‌జాజిగా చూపించే ఛాన్స్ ఎప్ప‌టికి వ‌స్తుందో?  ఆమెను అలా వెండితెర మీద చూస్తే ఎలా ఉంటుందో.. కాసేపు ఊహ‌ల‌కు ప‌ని పెడ‌దామా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English