శ్రీ‌దేవి ఆఫ‌ర్ నిజ‌మే కానీ.. సైన్ చేయ‌లేద‌ట‌!

శ్రీ‌దేవి ఆఫ‌ర్ నిజ‌మే కానీ.. సైన్ చేయ‌లేద‌ట‌!

తెలుగు సినీ అభిమానులు.. టాలీవుడ్ దృష్టి అంతా అన్న‌గారి బ‌యోపిక్ య‌న్.టి.ఆర్ మీద‌నే అంద‌రి దృష్టి ఉంది. హ‌రికృష్ణ మ‌ర‌ణం ముందు వ‌ర‌కూ ఈ సినిమా మీద జోరుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే. ఈ సినిమాలో న‌టీన‌టుల ఎంపిక ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం.. భారీ తారాగ‌ణంతో అంద‌రి నోళ్ల‌ల్లో నానుతోంది.

ఈ మూవీలో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పాత్ర కోసం ర‌కుల్ ను ఎంపిక చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి.. ఇందులో వాస్త‌వం ఎంత‌?  శ్రీ‌దేవి పాత్ర‌కు ర‌కుల్ ఓకే చేశారా? అన్న ప్ర‌శ్న‌ను ఆమెనే అడిగిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని వెల్ల‌డించింది. య‌న్‌.టీ.ఆర్ మూవీలో త‌న‌ను శ్రీ‌దేవి పాత్ర కోసం సంప్ర‌దించ‌టం.. ఆ పాత్ర మీద చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు చెప్పింది.

తాను శ్రీ‌దేవికి పెద్ద అభిమానినని..ఆమె అంటే త‌న‌కెంతో గౌర‌వ‌మ‌ని చెప్పింది ర‌కుల్‌. అలాంటి శ్రీ‌దేవి పాత్ర చేయ‌టం చాలా పెద్ద స‌వాలుగా చెప్పింది.  శ్రీ‌దేవి పాత్ర‌కు తాను న్యాయం చేయ‌గ‌ల‌న‌ని న‌మ్మి త‌న‌ను అడ‌గ‌టం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లుగా చెప్పిన ఈ బ్యూటీ.. ఈ సినిమాకు ఇంకా సైన్ చేయ‌లేదంది.

త‌న‌ను సంప్ర‌దించార‌ని.. ఈ సినిమా మీద చ‌ర్చ‌లు జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే అయినా.. క‌థ‌ను తానింత‌వ‌ర‌కూ విన‌లేద‌ని.. త‌మిళ‌.. హిందీ సినిమాల షూటింగ్ హ‌డావుడి పూర్తి చేసుకొని హైద‌రాబాద్ వ‌చ్చాక క‌థ తాను విన‌నున్న‌ట్లు చెప్పింది. సినిమాకు సైన్ చేసిన త‌ర్వాత తానే అధికారికంగా వెల్ల‌డిస్తాన‌ని చెప్పింది.

శ్రీ‌దేవి పాత్ర‌కు ఓకే చెబితే మాత్రం ఆవిడ గురించి తెలియ‌ని చాలా విష‌యాలు తెలుసుకోవాల‌ని.. ఆ పాత్ర‌ను తానుచేస్తే మాత్రం కొత్త ర‌కుల్ ను చూడ‌టం ఖాయ‌మంటున్నారు. మ‌రి.. ఆ తీపి క‌బురేదో కాస్త తొంద‌ర‌గా తేల్చేయొచ్చుగా ర‌కుల్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు