అందుకే రెండేళ్లు బ్రేక్ తీసుకుంద‌ట‌

అందుకే రెండేళ్లు బ్రేక్ తీసుకుంద‌ట‌

సినిమాల్లో జోరుగా అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్పుడు త‌మ‌కు తాముగా బ్రేక్ తీసుకోవ‌టం సాధ్య‌మేనా? అలాంటి ధైర్యం ఎవ‌రికైనా ఉంటుందా?  ఛాన్సులు రావ‌ట‌మే గొప్ప అన్న‌ట్లుగా ఫీల‌య్యే ఈ రోజుల్లో.. వ‌చ్చిన ఛాన్సుల్ని సారీ.. అని చెప్ప‌టం.. అందునా ఒక హీరోయిన్  అలా చేస్తారా? అన్న సందేహం క‌ల‌గొచ్చు. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే నిత్యా మీన‌న్ మాత్రం అలాంటి ప‌నులే చేస్తుంటారు.

సినిమా ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన త‌ర్వాత ఒక సినిమా త‌ర్వాత ఒక‌టి చేయ‌టం.. వ‌రుస సినిమాల్లో క‌నిపించ‌టం.. ఏ మాత్రం అవ‌కాశాలు మిస్ అయినా తెగ వ‌ర్రీ అయిపోవ‌టం క‌నిపిస్తుంటుంది. కానీ.. నిత్య అలాంటి అమ్మాయి కాదు. ఆమె జీవితంలో సినిమా అన్న‌ది ఒక భాగం మాత్ర‌మే. ఆమెకు సినిమాకు మించిన విష‌యాలుచాలానే ఉంటాయ‌ని చెబుతారు. గ‌డిచిన రెండేళ్ల‌లో ఆమె గీతాగోవిందం ముందు క‌నిపించ‌లేదు.

మ‌రి.. ఆ టైంలో ఏం చేశారు? అని అడిగితే.. ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చింది. జీవితంలో సినిమా ఒక భాగం మాత్ర‌మేన‌ని.. ఇంకా చాలా విష‌యాలు ఉంటాయంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న‌ప్పుడు.. తాను జీవితంలో చేయాల‌నుకున్న చాలా విష‌యాలు మిస్ అవుతున్నాన‌ని అనిపించింద‌ని..  అందుకే సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి త‌న‌కు న‌చ్చినట్లుగా ఉండాల‌ని తాను అనుకున్న‌ట్లుగా చెప్పింది.

సంగీతం.. ఫోటోగ్ర‌ఫీ.. బుక్స్ చ‌ద‌వ‌టం లాంటి ఇష్టాల్ని పూర్తి చేయ‌లేక‌పోతున్నాన‌ని.. అందుకే అలాంటి వాటి మీద దృష్టి పెట్టేందుకు మ‌ధ్య‌లో విరామం తీసుకున్న‌ట్లు చెప్పింది. నిజానికి అది విరామం కాద‌ని.. రెండేళ్ల‌లో వేరే అంశాల మీద దృష్టి పెట్టిన‌ట్లుగా చెప్పింది నిత్య‌.  

రెండేళ్ల‌లో మ్యూజిక్ ఆల్బ‌మ్స్ చేయ‌టానికి ఏర్పాట్లు చేస్తున్నాన‌ని.. చాలామంది క‌ళాకారుల్ని ఒక చోట‌కు చేరుస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అందులో తాను పాడుతాన‌ని.. గిటార్ వాయిస్తాన‌ని.. చెప్పింది. త‌న‌కు సంబంధించి ఒక మ్యూజిక్ ట్రూప్ ఉంద‌ని చెప్పింది. త్వ‌ర‌లోనే తాను మూడు సినిమాల్లో క‌నిపించ‌నున్న‌ట్లు చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు