స్పైడ‌ర్ త‌ర్వాత స్లో అయ్యాన‌ని ఎవ‌ర‌న్నారు?

స్పైడ‌ర్ త‌ర్వాత స్లో అయ్యాన‌ని ఎవ‌ర‌న్నారు?

ఇవాల్టి రోజున అందం ఒక్క‌టే సినిమా అవకాశాలు అస్స‌లు తెచ్చి పెట్ట‌వు. అందంతో పాటు.. టాలెంట్ చాలా ముఖ్యం. అలాంటి క్వాలిటీస్ ట‌న్నులు ట‌న్నులు ర‌కుల్ లో ఉన్నాయ‌ని చెప్పాలి. బ్యూటీ విత్ బ్రెయిన్ గా ర‌కుల్ గురించి చెప్పేటోళ్లు చాలామందే క‌నిపిస్తారు.

వ‌రుస పెట్టి తెలుగు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. మ‌హేశ్ తో చేసిన స్పైడ‌ర్ త‌ర్వాత ఆమె జోరు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆమె ఊసే ఈ మ‌ధ్య క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు తొమ్మిదేళ్లు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఇప్ప‌టికి పాతిక పైనే సినిమాల్ని పూర్తి చేసింది.

ఏడాదికి మూడు నుంచి ఐదు సినిమాలు చేసిన స‌త్తా ర‌కుల్ దే. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే అగ్ర‌హీరోల‌తో జ‌త క‌ట్టిన ఈ ఢిల్లీ భామ స్పైడ‌ర్ త‌ర్వాత తెలుగు సినిమాలో కనిపించ‌టం లేదు. అవ‌కాశాలు త‌గ్గాయా? అన్న క్వ‌శ్చ‌న్ వేస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని చెప్పుకొచ్చింది.

స్పైడ‌ర్ త‌ర్వాత స్లో అయ్యాన‌న్న మాట‌లు అస్స‌లు నిజం లేద‌ని చెప్పింది. స్పైడ‌ర్ చేసే ముందే త‌మిళంలో నాలుగు సినిమాల‌కు సంత‌కం చేశాన‌ని.. అప్ప‌టికే హిందీలో తాను అయ్యారీ షూట్ చేస్తున్నాన‌ని.. అలాంటి స‌మ‌యంలో తెలుగు సినిమాలు చేసే టైం త‌న ద‌గ్గ‌ర లేని కార‌ణంగానే ఒప్పుకోలేన‌ని చెప్పింది. డైరీలో ఎంత వెతికినా నెల‌కు 30 రోజులే ఉంటున్నాయ‌ని న‌వ్వేసింది.
 
తెలుగు సినిమాల‌ను ఓకే చేసేందుకు స‌రిప‌డా డేట్స్ త‌న ద‌గ్గ‌ర లేకున్నా.. మీడియాలో మాత్రం త‌న‌కు సినిమాలు లేవ‌ని రాస్తున్నారంటూ వాపోయింది. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ తో దే దే ప్యార్ దే.. సూర్య‌తో ఎన్ జీకే.. కార్తీ 17.. శివ‌కార్తీకేయ‌న్ తో ఒక మూవీ చేస్తున్నాన‌ని.. ఇప్ప‌టికే క్ష‌ణం తీరిక లేకుండా ప‌రుగులు తీస్తున్న‌ట్లు చెప్పింది.

నెల‌కు 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండి ఉంటే.. తాను మ‌రిన్ని సినిమాలు చేసే దానిన‌ని పేర్కొంది. స్పైడ‌ర్ త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తాను ఒక్క రోజుకూడా ఖాళీగా లేన‌ని.. హైద‌రాబాద్ లో మాత్రం ఉండ‌ట్లేదు త‌ప్పించి.. స్లో అయ్యింది లేద‌ని చెప్పింది. విన్నారా.. ర‌కుల్ చెప్పిందంతా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు