నాగార్జున కల నెరవేర్చేస్తాడా?

నాగార్జున కల నెరవేర్చేస్తాడా?

తనయుడిని మాస్‌ మెచ్చిన హీరోగా చూడాలని నాగార్జున చాలా కాలంగా కలగంటున్నారు. చైతన్యకి ఎలాగైనా పెద్ద మాస్‌ హిట్‌ ఇవ్వాలని నాగార్జున స్వయంగా కొన్ని ప్రాజెక్టులు సెట్‌ చేసి చూసినా కానీ ఫలితం రాలేదు. దీంతో ఇక అతను ఏమి చేసుకుంటే అదే చేసుకుంటాడని నాగార్జున వదిలేసాడు. ఫలానా టైపు సినిమా కావాలని నాగార్జున తనకి చెప్పకపోయినా కానీ నాగ్‌ మనసు ఎరిగినవాడిగా చైతన్య కోసం మారుతి మాస్‌కి దగ్గర చేసే అంశాలన్నీ పెట్టుకుని సినిమా తీసాడు.

శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు నాగచైతన్యని ఇంతవరకు చూడని విధంగా యాక్షన్‌ హీరోగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్‌, చరణ్‌లాంటి హీరోలకి పెట్టే రేంజ్‌ యాక్షన్‌ బ్లాక్స్‌ ఇందులో పెట్టాడు. అలాగే ఎమోషనల్‌గా కూడా చైతన్య టాలెంట్‌ ఏమిటనేది మారుతి ఇందులో చూపిస్తున్నాడు. ఇంతవరకు లవ్‌స్టోరీస్‌కే పరిమితం అయిన చైతన్య ఈసారి ఆల్‌రౌండర్‌గా కనిపించబోతున్నాడు.

అన్ని అంశాలకి తోడు కామెడీ కూడా బాగా పెట్టుకుని ఈ చిత్రాన్ని పకడ్బందీగా తీర్చిదిద్దారు. మారుతి ఫార్ములా కనుక క్లిక్‌ అయిందంటే ఇక శైలజారెడ్డి అల్లుడు చైతన్యకి చాలా కాలంగా ఊరిస్తోన్న ముప్పయ్‌ కోట్లు, నలభై కోట్ల విజయాన్ని అందించగలుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు