దేవర'కొండ'తో ఢీ నా... వద్దు బాబోయ్‌!

దేవర'కొండ'తో ఢీ నా... వద్దు బాబోయ్‌!

రవితేజకి ఎన్నో ఏళ్ల అనుభవం వుండొచ్చు. ఒక టైమ్‌లో తెలుగు సినిమా పరిశ్రమలో బిజీ హీరోగా వెలుగు వెలిగి వుండొచ్చు. కానీ ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హవా నడుస్తోంది. విజయ్‌ వర్సెస్‌ రవితేజ అని చూసుకుంటే విజయ్‌ సినిమాకే బిజినెస్‌ ఎక్కువ జరుగుతుంది. కలక్షన్లూ ఎక్కువ వస్తాయి. రవితేజ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కంటే విజయ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ రెండింతలకి పైగా వసూలు చేసింది. ఎంత సీనియర్‌ అయినా కానీ విజయ్‌ సినిమాతో రవితేజ సినిమా పోటీకి వెళితే మాస్‌ మహారాజాకే డేంజర్‌.

ఇది గుర్తించడం వల్ల 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' నిర్మాతలు మైత్రి మూవీస్‌ వాళ్లు పంతానికి పోవడం లేదట. రవితేజ చిత్రాన్ని అక్టోబర్‌ 4న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించుకున్నా కానీ, అదే డేట్‌ అనౌన్స్‌ చేసిన నోటాకి దారి వదిలేసి, వాళ్లు వేరే డేట్‌కి వెళ్లిపోతున్నారు. పంతానికి పోయి విజయ్‌ దేవరకొండ సినిమాని ఢీకొనడం తెలివైన పని కాదని రవితేజ, శ్రీనువైట్లకి చెప్పుకుని 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'కి వేరే ముహూర్తం పెట్టించుకుంటున్నారు.

అదే సమవుజ్జీ అయిన సినిమా వస్తోందనుకోండి. మా డేట్‌కే వస్తారా అంటూ పంతం పట్టేవారు. కానీ ఇప్పుడు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఎలా వుందో చూసిన తర్వాత కూడా పంతాలు, పట్టింపులకి పోతే అసలుకే ఎసరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English