అయ్యయ్యో హిట్టు కళ లేదే..!

అయ్యయ్యో హిట్టు కళ లేదే..!

చియాన్‌ విక్రమ్‌కి హిట్‌ వచ్చి చాలా కాలమవుతోంది. వరుసగా పరాజయాలు చవిచూస్తోన్న టైమ్‌లో 'సామి' చిత్రానికి సీక్వెల్‌ చేయాలని డిసైడయ్యాడు. విక్రమ్‌ స్టార్‌ అవడంలో కీలక పాత్ర పోషించిన సినిమాల్లో సామి ఒకటి. తెలుగులోకి లక్ష్మీనరసింహాగా రీమేక్‌ అయి ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది.

ఎ్కడా వాయిస్‌ లేపకుండానే విక్రమ్‌ ఆ చిత్రంలో హీరోయిజం చూపించిన దానికి అప్పట్లో చాలా పేరొచ్చింది. అయితే ఆ చిత్రానికి సీక్వెల్‌ అయిన 'సామి స్వ్కేర్‌'లో మాత్రం ఆ మంచి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. సూర్యతో సింగం సిరీస్‌ తీసిన దర్శకుడు హరి ఈసారి 'సామి'ని కూడా అదే రీతిన తెరకెక్కించాడు. 'సామి' తెలుగు ట్రెయిలర్‌ చూస్తోంటే 'సింగం 3' ట్రెయిలర్‌లో సూర్యకి బదులు విక్రమ్‌ని చూస్తోన్న భావన కలుగుతోంది.

ఏ కోశాన హిట్టు కళ కనిపించడం లేదని ఇంటర్నెట్‌లో ఈ ట్రెయిలర్‌ని బాగా ట్రోల్‌ చేస్తున్నారు. హీరోయిన్‌గా 'మహానటి' ఫేమ్‌ కీర్తి సురేష్‌ వున్నా ఎలాంటి ఫరక్‌ పడలేదు. ఈమధ్య ఇలాంటి లౌడ్‌ మాస్‌ చిత్రాలకి ప్రేక్షకాదరణ అసలు వుండడం లేదు. మరి కాలం చెల్లిపోయిన ఈ ఫార్ములాతో విక్రమ్‌ ఏం చేస్తాడనేది ఈ నెల 20న తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు