గేమ్‌ గీతా మాధురివైపు తిప్పుతోన్న బిగ్‌బాస్‌!

గేమ్‌ గీతా మాధురివైపు తిప్పుతోన్న బిగ్‌బాస్‌!

'బిగ్‌బాస్‌' సీజన్‌ 2 మరో వారం రోజుల పాటు పొడిగించారట. ఇప్పటికే నూట అయిదు రోజులు ఎక్కువ అని అంతా భావిస్తూ వుంటే, ఇప్పటికిప్పుడు మరో వారం రోజులు పొడిగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో? హౌస్‌లో వున్న చాలా మంది ఆసక్తి కోల్పోయి కేవలం ఫైనల్స్‌కి వెళితే చాలుననే రీతిన గేమ్‌ ఆడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో వారం పాటు ఫైనల్‌ వెనక్కి జరిగితే వాళ్ల మూడ్‌ ఎలాగుంటుందో? అయితే ఈ ప్లాన్‌లో మార్పు వెనుక ఆసక్తికర కారణాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది.

ఇంకా ప్రజామోదం కౌషల్‌కే అనుకూలంగా వుండడంతో ఆ అనుకూలతని తగ్గించడానికి వారం ఎక్కువ సమయాన్ని బిగ్‌బాస్‌ తీసుకుంటోందని, కౌషల్‌ ప్రభావాన్ని తగ్గించే పని ఎప్పట్నుంచో మొదలు పెట్టకపోవడం వల్ల ఇంకా ఆశించిన ఫలితాలు రావడం లేదని నిర్వాహకులు భావిస్తున్నారట.

అలాగే ఎలాగైనా ఈ గేమ్‌లో గీతా మాధురిని విజేతని చేయాలనే దిశగా కూడా పావులు కదుపుతున్నారట. అందుకే గీత ఎప్పుడు తప్పులు చేస్తున్నా వెంటనే కవర్‌ చేసేస్తున్నారట. ఆమెకి వెంటనే కర్తవ్యం బోధిస్తున్నారట. తాజాగా ఆమెకి బయటినుంచి రెండోసారి కాల్‌ చేయించారు. ఇంకా హౌస్‌లో అమిత్‌, దీప్తి, సామ్రాట్‌, శ్యామలతో కాలర్స్‌ మాట్లాడకపోయినా గీతకే రెండోసారి కాల్‌ ఇవ్వడమే కాకుండా ఈసారి లేడీనే బిగ్‌బాస్‌ విన్నర్‌గా చూడాలని వుందని పబ్లిక్‌ ఫీలవుతోన్న మెసేజ్‌ పాస్‌ చేసారు.

గీత విషయంలో మొదట్నుంచీ సాఫ్ట్‌ వెళుతోన్న నాని కూడా తనకే అనుకూలంగా వున్నాడనేది సోషల్‌ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. బిగ్‌బాస్‌ ప్లాన్స్‌ ఏమైనా కానీ ఓటింగ్స్‌ మేనిప్యులేట్‌ చేయకపోతే మాత్రం ప్రస్తుతానికి కౌషల్‌ లీడింగ్‌లో వున్నాడు. పబ్లిక్‌ అతడిని చూసే దృష్టి కోణాన్ని ఎలా మారుస్తారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు