మెగా దెబ్బకి అక్కినేని మందు!

మెగా దెబ్బకి అక్కినేని మందు!

అతి తక్కువ కాలంలో పవర్‌స్టార్‌, స్టయిలిష్‌ స్టార్‌తో జంట కట్టే అవకాశం దక్కిన అను ఎమాన్యుయేల్‌కి కాలం కలిసి రాలేదు. ఫ్లాప్‌ అయ్యే అవకాశమే లేదనిపించే కాంబినేషన్‌ అయిన పవన్‌, త్రివిక్రమ్‌ నుంచి వచ్చిన 'అజ్ఞాతవాసి'తో ఆమెకి పెద్ద దెబ్బ తగిలింది. మినిమం గ్యారెంటీ అనిపించుకున్న అల్లు అర్జున్‌కి అరుదుగా వచ్చిన ఫ్లాప్‌ కాస్తా తాను నటించిన 'నా పేరు సూర్య'నే అయింది. వరుసగా రెండు మెగా దెబ్బలతో ఈ అమ్మడు బాగా చిన్నబోయింది. అయితే ఈసారి అక్కినేని హీరో మీద ఆమె ఆశలు పెట్టుకుంది. నాగచైతన్యతో కలిసి నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' వచ్చే వారం విడుదల కానుంది.

ఈ చిత్రంలో ఇగోయిస్టిక్‌ క్యారెక్టర్‌ చేసిన అను ఎమాన్యుయేల్‌ ఈ చిత్రం తన రాత మార్చేస్తుందని కాన్ఫిడెంట్‌గా వుంది. ఇందులో తన పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుందని, రమ్యకృష్ణతో పోటాపోటీగా సాగుతుందని, నటిగా పేరు తెచ్చి పెట్టడమే కాకుండా తనపై పడ్డ ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్రని ఇది చెరిపేస్తుందని అను ఆశిస్తోంది. తాను వున్న సినిమాలన్నీ ఫెయిల్‌ అనే అపవాదుకి చిన్న ఉపశమనంగా అతిథి పాత్రలో కనిపించిన 'గీత గోవిందం'తో తన గీత మారిందని ఈ ఎన్నారై భామ భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English