టీవీ యాంకర్‌తో స్టార్‌ హీరో రొమాన్స్‌

టీవీ యాంకర్‌తో స్టార్‌ హీరో రొమాన్స్‌

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ప్రేమలో పడ్డాడా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ గాసిప్‌ వర్గాలు. తాను ప్రేమలో పడిన విషయాన్ని, ఎవరితో పడిన సంగతిని తానే హింట్‌ ఇచ్చి మరీ గాసిప్స్‌కి ఊతమిస్తున్నాడతగాడు. అతను ప్రేమలో పడిన ముద్దుగుమ్మ మరెవరో కాదు... ఐపీఎల్‌ యాంకర్‌గా తన హాట్‌నెస్‌తో కుర్రకారుకి గిలిగింతలు పెట్టిన షిబానీ దండేకర్‌.

మూడు పదుల వయసు దాటి చాలా కాలమైనా పెళ్లి చేసుకోని ఈ సెక్సీ భామ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ విషయంలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లకి తీసిపోదు. అంతే కాదు వారందరికీ దిమ్మ తిరిగేలా బికినీల్లో, రివీలింగ్‌ బట్టల్లో ఫోజులిస్తూ నిత్యం అభిమానులు తన సోషల్‌ మీడియా పేజ్‌లు పట్టుకు వేలాడేలా చేస్తుంది. మొదటి భార్యతో విడాకులు పొందిన ఫర్హాన్‌ గత రెండేళ్లుగా ఈమెతో రిలేషన్‌లో వున్నాడట. ఇప్పుడు తమ బంధం గట్టిదేననే నమ్మకం కలిగిందో ఏమో సరాసరి తమ సంగతి బయట పెట్టకుండా ఫోటోల ద్వారా హింట్లు ఇస్తూ వార్తల్లో వుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు