దేవరకొండకి చివరి పరీక్ష

దేవరకొండకి చివరి పరీక్ష

కళ్లు మూసి తెరిచేలోగా పేరు తెలియని స్థాయి నుంచి సూపర్‌స్టార్స్‌ సరసకి చేరిపోయిన విజయ్‌ దేవరకొండ తనకి తానే చివరి పరీక్ష పెట్టుకుంటున్నాడా అన్నట్టు 'నోటా' అనే సీరియస్‌ పొలిటికల్‌ డ్రామా చేస్తున్నాడు. తమిళ రంగంలో అడుగు పెట్టడానికి విజయ్‌ ఎంచుకున్న ఈ చిత్రం అతని తెలుగు మార్కెట్‌ని విస్మరించలేదు కనుక తెలుగులోకి కూడా అనువాదం అవుతోంది. 'గీత గోవిందం'తో అరవై కోట్లకి పైగా వసూళ్లు సాధించిన విజయ్‌ మరి ఈసారి యూత్‌, ఫ్యామిలీస్‌ ఇష్టపడని జానర్‌ని ఎంచుకుని బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

'నోటా' లాంటి చిత్రాలు విజయ్‌కి పెట్టని కోటగా మారిన యూత్‌ని ఆకట్టుకునే అవకాశాలు తక్కువే. ఒకవేళ వారు చూసినా కానీ అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చూసిన తీరుగా చూడరనే చెప్పాలి. కాకపోతే ఈ తరహా చిత్రాలకి మాస్‌ ఆదరణ దక్కే ఆస్కారముంది. ఏదేమైనా విజయ్‌ మరోసారి తన స్టామినాని పరీక్షించుకుంటోన్న మాదిరిగా అనిపిస్తోన్న నోటా కనుక పాతిక నుంచి ముప్పయ్‌ కోట్ల రేంజ్‌కి వెళ్లగలిగితే ఇక అతడి సామర్ధ్యంపై అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. విజయ్‌ని స్టార్‌ కాదంటోన్న నాగశౌర్య లాంటి వారికి కూడా అప్పుడు స్పష్టమైన ఆన్సర్‌ వచ్చేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు