షాక్‌లో విలవిల్లాడుతోన్న హీరో

షాక్‌లో విలవిల్లాడుతోన్న హీరో

'ఛలో'తో వచ్చిన ఆనందం కనీసం కొన్ని నెలలైనా మిగలకుండానే 'నర్తనశాల' హరించేసింది. ఈ చిత్రం అత్యంత ఘోరమైన పరాజయం పాలవడంతో నాగశౌర్య షాక్‌ తిన్నాడు. ఛలో చిత్రానికి ఏదయితే చేసాడో దీనికి కూడా అదే చేసినా కానీ ఫలితం దానికి పూర్తిగా రివర్స్‌లో వచ్చేసరికి కుర్రాడు మళ్లీ బ్యాక్‌ టు స్క్వేర్‌ వన్‌ వచ్చేసాడు. నర్తనశాల గ్యారెంటీ హిట్‌ అనే ధీమాతో తదుపరి చిత్రాలు కూడా తన బ్యానర్లో లైన్లో పెట్టాడట. నాలుగు కథలు విని, నలుగురు యువ దర్శకులని వెయిటింగ్‌లో వుంచాడు. నర్తనశాల చిత్రం విషయంలో పెట్టుబడి పెట్టిన తన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసినా కానీ తనకి నమ్మకం వుందంటూ వాళ్ల మాట లెక్క చేయలేదట.

ఛలోకి వచ్చింది మొత్తం నర్తనశాలకి పోవడంతో అతని పేరెంట్స్‌ కూడా శౌర్య ఛాయిస్‌ని శంకిస్తున్నారట. దీంతో తను విని ఓకే చేసిన కథల్నే మళ్లీ మళ్లీ వింటూ, తెలిసిన వారికి వినిపిస్తూ బాగుందా లేదా అంటూ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నాడట. ఛలోకి ముందు సమయం తీసుకుని ఆ చిత్ర విజయానికి అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న శౌర్య 'నర్తనశాల' విషయంలో కంగారు పడ్డాడు. అంతకుముందే తను చేసిన సినిమాలు కణం, అమ్మమ్మగారిల్లు లాంటివి విడుదలై ఫ్లాపవడం వల్లే 'నర్తనశాల' త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూసాడని, అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొక్కటి అన్నట్టు అయి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని అతని సన్నిహితులు చింతిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు