ప్రభాస్‌ ఇరుక్కుపోయాడా?

ప్రభాస్‌ ఇరుక్కుపోయాడా?

'బాహుబలి' చిత్రంతో తన రేంజ్‌ అమాంతం జాతీయ స్థాయికి పెరగడంతో దానిని మెయింటైన్‌ చేయడంలో ప్రభాస్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బాహుబలి తీసిన రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మళ్లీ లోకల్‌ మార్కెట్‌నే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఎన్టీఆర్‌, చరణ్‌తో తీసే మల్టీస్టారర్‌కి మిగతా మార్కెట్లు బోనస్‌గా మాత్రమే వుంటాయి తప్ప ప్రధానంగా దృష్టి పెడుతున్నది తెలుగు వెర్షన్‌ బిజినెస్‌పైనే. కానీ ప్రభాస్‌ మాత్రం లోకల్‌ డైరెక్టర్లతో బాలీవుడ్‌ మార్కెట్‌ని కూడా టార్గెట్‌ చేస్తున్నాడు. బాహుబలి విడుదల కాకముందే యువ దర్శకులు సుజిత్‌, రాధాకృష్ణకి ప్రభాస్‌ మాట ఇచ్చాడు.

అతను వచ్చే వరకు వేరే చిత్రం చేయకూడదని వాళ్లిద్దరూ మరో వ్యాపకం లేకుండా అలాగే వుండిపోయారు. ముందుగా సుజిత్‌తో సాహో చిత్రాన్ని ప్రభాస్‌ స్టార్ట్‌ చేసాడు. అనుభవం లేని ఈ దర్శకుడిపై ఇంత భారం పెట్టడంతో ప్రోగ్రెస్‌ చాలా స్లోగా జరుగుతోంది. ఈ యేడాదిలో వచ్చేస్తుందని భావించిన సాహో వచ్చే వేసవికి అయినా పూర్తిగా రెడీ అవుతుందా అనేది అనుమానంగానే వుంది. మరోవైపు జిల్‌ తీసిన రాధాకృష్ణ సాహో పూర్తయ్యేవరకు ఖాళీగా వుండేందుకే సిద్ధపడ్డాడు. ఇప్పుడతడిని నొప్పించడం ఇష్టం లేక దానిని కూడా ప్రభాస్‌ అనౌన్స్‌ చేసాడు. కొరటాలతో మధ్యలో ఒక సినిమా చేస్తాడనేది ఉత్తుత్తి మాటే అని తేలిపోయింది. బాహుబలి మార్కెట్‌కి రాజమౌళి బ్రాండింగ్‌ ఎంత హెల్ప్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడీ చిత్రాలకి మాత్రం ప్రభాస్‌ తప్ప మరియేవిధమైన బోనస్‌ ఎలిమెంట్స్‌ లేవు. మామూలుగా అయితే వేరే స్టార్‌ డైరెక్టర్లని అప్రోచ్‌ అయి వుండేవాడే కానీ మాట ఇచ్చి ప్రభాస్‌ ఇలా ఇరుక్కుపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు