మెగాభిమానులకు చరణ్ గూస్ బంప్స్

మెగాభిమానులకు చరణ్ గూస్ బంప్స్

'రంగస్థలం' సినిమాతో ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేశాడు రామ్ చరణ్. నటుడిగా తన ప్రతిభపై ఉన్న సందేహాలన్నింటికీ అతను తెరదించాడు. దర్శకుడు సుకుమార్ ను కూడా వెనక్కి నెట్టి.. ‘రంగస్థలం’ విజయంలో ఎక్కువ క్రెడిట్ తనే తీసుకున్నాడు. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఊహించిన స్థాయి విజయాన్నందుకుంది. దీని తర్వాత చరణ్ నుంచి వచ్చే సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈసారి రూటు మార్చి బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు చరణ్. ‘ధృవ’.. ‘రంగస్థలం’ లాంటి భిన్నమైన చిత్రాలతో కొత్త అభిమానుల్ని సంపాదించుకున్న చరణ్.. ఈసారి మళ్లీ తన మాస్ ఫ్యాన్స్ ను మురిపించాలనుకుంటున్నాడు. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తిరుగులేని దర్శకుడిగా పేరున్న బోయపాటి.. చరణ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తితో ఉన్నారు.

ఇప్పటిదాకా చరణ్-బోయపాటి సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. టైటిల్ ప్రకటించలేదు. పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఐతే తాజాగా ఒక వెరైటీ పిక్ రిలీజ్ చేశారు. ఈ చిత్ర బృందం దాదాపు నెల రోజుల షెడ్యూల్ కోసం అజెర్బైజాన్‌ వెళ్లింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చరణ్ స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న ఫొలోను వదిలారు., ఐతే అందులో చరణ్ ముఖం చూపించలేదు. బ్యాక్.. సైడ్ లుక్ లో ఉన్నాడు. కండలు తిరిగిన బాడీ.. గడ్డంతో చరణ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు. ఇంతకుముందు అల్లు అర్జున్ ను ‘సరైనోడు’లో ఊర మాస్ గా ప్రెజెంట్ చేసి అభిమానుల్ని అలరించిన బోయపాటి.. చరణ్ ను కూడా తనదైన శైలిలో చూపిస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజా షెడ్యూల్ తో సినిమా దాదాపుగా పూర్తి కావస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English