ఆర్జీవీ శిష్యుడా మజాకా

ఆర్జీవీ శిష్యుడా మజాకా

రామ్ గోపాల్ వర్మ శిష్యులు కూడా ఆయన లాగే కొంచెం భిన్నంగా ఉంటారు. వాళ్ల సినిమాలే కాదు.. మాటలు.. ప్రవర్తన అంతా వెరైటీగా ఉంటుంది. మాటలకు ముసుగేయకుండా బోల్డ్ కామెంట్లు చేయడం వర్మ శైలి. శిష్యులు సైతం అదే శైలిని అనుసరిస్తుంటారు. ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వర్మ శిష్యుడు అజయ్ భూపతి.. ఈ చిత్ర విడుదలకు ముందు నుంచే హాట్ కామెంట్స్‌తో మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద సక్సెస్ కావడంతో అతడి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. మరింత సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తన గురువు రామ్ గోపాల్ వర్మను తనదైన శైలిలో గౌరవించుకున్నాడు.


బ్యాగ్రౌండ్లో ‘టీచర్స్’ బ్రాండ్ మద్యం సీసా పెట్టి ముందు వర్మ బొమ్మ పెట్టి టీచర్స్ డే విషెస్ చెప్పాడు అజయ్. దీంతో పాటుగా ‘నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత’ అనే క్యాప్షన్ కూడా జోడించాడు అజయ్. ఆ మెసేజ్‌కి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైనప్పటి నుంచి తన ప్రతి ఇంటర్వ్యూలోనూ తనపై వర్మ ప్రభావం ఎంతో.. వర్మ నుంచి ఎంత నేర్చుకున్నానో చెబుతూనే ఉన్నాడు అజయ్. అంతే కాక ట్విట్టర్లో తన ప్రొఫైల్ పిక్ కూడా వర్మతో ఉన్నదే పెట్టాడు. దర్శకుడిగా వర్మ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ‘శివ’ సినిమాతో ఒక తరాన్నే ప్రభావితం చేశాడతను. దేశంలో కోట్ల మందిని తన సినిమాలతో ప్రభావితం చేశాడాయన. ఇక సినీ పరిశ్రమ వైపు వేలాది మందిని ఇన్‌స్పైర్ చేశాడు. ఆయన సినిమాల్లో పని చేయడం ద్వారా వందల మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక దర్శకులుగా పదుల సంఖ్యలో వచ్చారు వర్మ స్కూల్ నుంచి. వాళ్లలో చాలామంది గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు