'మను'కు కంచరపాలెం పంచ్

'మను'కు కంచరపాలెం పంచ్

మను.. రెండేళ్ల కిందట మొదలైన సినిమా ఇది. ‘మధురం’ సహా కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు సంపాదించిన ఫణీంద్ర నరిశెట్టి దర్శకుడిగా మారి ఈ చిత్రం తీశాడు. సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపుతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఫణీంద్ర. ఈ చిత్ర ప్రోమోలు చూస్తే ఇది టాలీవుడ్లో మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందన్న అంచనాలు కలిగాయి. కొత్త తరహా సినిమాలు కోరుకునేవాళ్లకు ఈ చిత్రం మంచి ఛాయిస్ లాగా అనిపిస్తోంది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐతే దీనికి అదే రోజు రిలీజవుతున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ అడ్డంకిగా మారుతోంది. ఆ చిత్రాన్ని కూడా ఓ కొత్త దర్శకుడే రూపొందించాడు. అది చాలా కొత్తగా ఉందని అంటున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్ దానికి అండగా నిలిచింది. ముందే సెలబ్రెటీలకు, మీడియాకు ప్రివ్యూలు వేసి టాక్ జనాల్లోకి వెళ్లేలా చేశారు సురేష్.


దీని గురించి ఇప్పటికే చాలా చర్చ నడిచింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాగే ‘మను’ కూడా కొత్త తరహా సినిమానే. దాని లాగే దీనికే ఫోకస్ రావాలి. చర్చ జరగాలి. కానీ ఇప్పుడు టాలీవుడ్ చర్చలన్నీ ‘కంచరపాలెం’ చుట్టూనే తిరుగుతున్నాయి. ‘మను’ ఈ విషయంలో వెనుకబడిపోయింది. దీని గురించి పెద్ద చర్చ లేదు. ఆశించిన బజ్ రాలేదు. వేరే సినిమాలతో పోటీ పెద్ద సమస్య కాదు కానీ.. ‘కేరాఫ్ కంచరపాలెం’తో పోటీ పడటం దీనికి ప్రతికూలమైంది. ఇండస్ట్రీ జనాలు ‘కంచరపాలెం’ లాగా దీన్ని ఓన్ చేసుకోలేదు. ప్రమోట్ చేయలేదు. ‘కేరాఫ్ కంచరపాలెం’ను ముందు నుంచి అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ‘మను’ మరో డేట్ చూసుకుని ఉంటే బాగుండేది. అప్పుడు ఇండస్ట్రీతో పాటు జనాల ఫోకస్ కూడా దాని మీద ఉండేదేమో. ఐతే ఇప్పుడిక చేయడానికేమీ లేదు. రిలీజ్ తర్వాత టాక్‌ను బట్టి ఈ సినిమాకు బజ్ పెరిగి మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు