మారుతికి అతను దొరుకుతాడా?

మారుతికి అతను దొరుకుతాడా?

టాలీవుడ్ ఈ తరం దర్శకుల్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌ మారుతి. మొదట్లో చిన్న సినిమాలు చేసిన మారుతి.. ఆ తర్వాత నానితో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసి తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, శర్వానంద్ లాంటి హీరోలతో జత కట్టాడు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘మహానుభావుడు’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు నాగచైతన్యతో తీసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మారుతి. ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమాకు రంగం సిద్ధం చేసే మారుతి.. ఈసారి మాత్రం తన తర్వాతి ప్రాజెక్టును ఇంకా ఖరారు చేయలేదు. అతను తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో చేయాలని ఆశ పడుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో కన్ఫర్మేషన్ రాకపోవడం వల్లే మారుతి ఇంకా తన తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు.


మారుతితో సినిమా చేయడానికి విజయ్‌కి కూడా ఆసక్తి ఉందట. మారుతి-విజయ్ కాంబినేషన్లో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్ సంస్థ కూడా రెడీగా ఉంది. కానీ సమస్యంతా విజయ్ దగ్గరే ఉంది. అతను దాదాపు అరడజను కమిట్మెంట్లతో ఉన్నాడు. ప్రస్తుతం ‘నోటా’.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటిస్తున్న విజయ్.. వీటి తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాచేయడానికి అంగీకరించాడు. దాని విషయంలోనే తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డితో వచ్చే ఏడాది మళ్లీ ఇంకో సినిమా చేయడానికి కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇంకా నందిని రెడ్డి సైతం వెయిటింగ్‌లో ఉంది. ఇంతమంది విజయ్ కోసం కాచుకుని ఉంటే.. మారుతికి అతనెప్పుడు సినిమా చేస్తాడో అర్థం కావడం లేదు. బహుశా మధ్యలో మారుతి వేరే సినిమా చేసి.. ఆ తర్వాత విజయ్‌తో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకుంటే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు