హృతిక్ రోషన్ షాకింగ్ లుక్

హృతిక్ రోషన్ షాకింగ్ లుక్

హృతిక్ రోషన్‌ను చూడగానే గ్రీకు వీరుడిలా కనిపిస్తాడు. తొలి సినిమాలోనే స్టన్నింగ్‌ లుక్‌తో ప్రేక్షకుల మనసు దోచాడతను. ‘కహోనా ప్యార్ హై’ చూసి ఎన్ని లక్షల మంది అమ్మాయిలు పిచ్చోళ్లయిపోయారో లెక్కలేదు. అప్పట్లో హృతిక్‌ను చూడ్డానికి వందల మంది అమ్మాయిలు ముంబయికి వచ్చేసినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రతి సినిమాలోనూ మ్యాన్లీ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తూ వస్తున్నాడు హృతిక్. ఒక్క ‘గుజారిష్’లో మాత్రమే అతను డీగ్లామరస్ రోల్ చేశాడు. ఐతే హృతిక్ మళ్లీ ఇప్పుడు పూర్తి డీ గ్లామరస్ రోల్ చేశాడు. పేద పిల్లలకు ఉచిత ఐఐటీ కోచింగ్ ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన సూపర్ 30 ఆనంద్ కుమార్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘సూపర్ 30’లో హృతిక్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు తాజాగా రిలీజయ్యాయి.


అందులో హృతిక్ షాకింగ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. సడెన్‌గా చూస్తే అందులో ఉన్నది హృతికేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతగా అవతారం మార్చేసి అతి సామాన్యుడిగా మారిపోయాడు హృతిక్. ‘‘ఇప్పటిదాకా రాజుల కొడుకులు మాత్రమే రాజులయ్యారు. కానీ ఇకపై ప్రతిభ ఉన్నవాడే రాజు అవుతాడు’’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్లు వదిలారు. అతి సామాన్యులైన పేద ప్రతిభావంతుల్ని చేరదీసి... తన ఇంట్లోనే వాళ్లను పెట్టుకుని.. ఫుడ్డు బెడ్డు అన్నీ ఇస్తూ వాళ్లకు ఐఐటీ శిక్షణ ఇస్తుంటాడు ఆనంద్. ఏటా అతను ఇలా 30 మంది పిల్లల్ని ఎంచుకుంటాడు. వారిలో మెజారిటీ స్టూడెంట్స్ ఐఐటీలకు ఎంపికవుతుంటారు. స్ఫూర్తిదాయకమైన ఆనంద్ కథతో సినిమా రాబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాది జనవరి 25న ‘సూపర్ 30’ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English