ఆ సినిమాను మూడేళ్లకు ముగించారు

ఆ సినిమాను మూడేళ్లకు ముగించారు

తమిళ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తాడతను. పోస్టర్ దగ్గర్నుంచి సినిమాలో చిన్న సన్నివేశం వరకు ప్రతిదీ ఎగ్జైటింగ్‌గ ఉండేలా చూసుకుంటాడు గౌతమ్. దక్షిణాదిన ప్రతి హీరో హీరోయిన్ అతడితో పని చేయడానికి తహతహలాడుతారు. కానీ ఇంత టాలెంట్ ఉన్న గౌతమ్‌.. కొన్నేళ్లుగా తనతో సినిమాలు చేసే వాళ్లకు నరకం చూపిస్తున్నాడు. అతడి సినిమాలు ఒక పట్టాన పూర్తి కావట్లేదు. అనుకున్న సమయానికి రిలీజ్ కావట్లేదు. నాగచైతన్య హీరోగా తీసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఎంత ఆలస్యం అయిందో తెలిసిందే. దీని తర్వాత ధనుష్, విక్రమ్ హీరోలుగా మొదలుపెట్టిన సినిమాలు రెండూ ఇబ్బందుల్లో పడ్డాయి. ధనుష్ సినిమా అయితే మొదలుపెట్టిన మూడేళ్లయింది. కానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కాదు.

ఇక ఈ చిత్రం విడుదల కాదేమో అని ధనుస్ ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. ఐతే ఇటీవలే గౌతమ్.. ఈ చిత్ర షూటింగ్‌ను తిరిగి ఆరంభించాడు. బ్యాలెన్స్ ఉన్న సన్నివేశాల్ని పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా చిత్ర కథానాయిక మేఘా ఆకాశ్ తాజాగా ట్వీట్ చేసింది. ‘సినిమా పూర్తయింది.. ఎట్టకేలకు’ అంటూ ఆమె పెట్టిన ట్వీటే పరిస్తితికి అద్దం పడుతోంది. ఈ సినిమా మొదలయ్యాక మేఘా తెలుగులో ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలు చేసింది. అవి వచ్చాయి. వెళ్లిపోయాయి. కానీ గౌతమ్ సినిమా మాత్రం మరుగున పడిపోయింది. తెలుగులో చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ చిత్రమైనా తన రాత మారుస్తుందేమో అని మేఘా ఆశ పడుతోంది. ఈ చిత్రాన్ని దీపాశళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు