భారతీయుడు-2.. సస్పెన్స్‌కి తెర

భారతీయుడు-2.. సస్పెన్స్‌కి తెర

దాదాపు ఏడాదవుతోంది ‘భారతీయుడు’ సీక్వెల్ అనౌన్స్ చేసి. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా ముందుకు కదల్లేదు. ‘2.0’ వాయిదా పడటంతో అందులోనే ఇరుక్కుపోయిన శంకర్.. ఈ సినిమాను వెంటనే పట్టాలెక్కించలేకపోయాడు. ఈ లోపు ఈ చిత్రం నుంచి దిల్ రాజు తప్పుకున్నాడు. మధ్యలో ‘2.0’ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని టేకప్ చేసింది.

మరోవైపు ‘2.0’ రిలీజ్ డేట్ ఖరారవడం.. ఆ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తవడంతో శంకర్ కూడా ఫ్రీ అయిపోయి ‘భారతీయుడు-2’ మీద దృష్టిపెట్టాడు. ఈ చిత్రం కోసం ఇటీవలే  లొకేషన్ల వేట కూడా మొదలుపెట్టాుడ శంకర్. ఈ చిత్రం కోసం బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్‌ను ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. నయనతారను కథానాయికగా ఫైనలైజ్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ ఓకే కానీ.. అసలీ సినిమాలో కమల్ హాసన్ నటిస్తాడా లేదా అనేది సస్పెన్సుగా మారింది. ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాలనుకుంటున్నాడని.. ‘భారతీయుడు-2’ ఆలస్యమైన నేపథ్యంలో ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పైగా ‘విశ్వరూపం-2’ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి తనకేమీ అప్ డేట్స్ లేవని కూడా చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. భారతీయుడు-2ను విక్రమ్‌తో తీయాలని శంకర్ చూస్తున్నాడన్న రూమర్లు కూడా వచ్చాయి.

ఐతే వీటన్నింటికీ తెరదించుతూ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అందులో ఒక చెయ్యి మాత్రమే కనిపిస్తోంది. అది కమల్ చెయ్యే అన్నది స్పష్టం. పైన కమల్ హాసన్ పేరు కూడా ఉంది. కింద ‘సేనాపతి ఈజ్ బ్యాక్’ అన్న క్యాప్షన్ కూడా ఉంది. అంతకుమించి వివరాలేమీ లేవు. ఈచిత్రంలో కమల్ హాసనే నటిస్తాడని క్లారిటీ ఇవ్వడానికే పోస్టర్ వదిలినట్లుగా అనిపిస్తోంది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు