అమలా పాల్ సెన్సేషనల్ లుక్ వైరల్

అమలా పాల్ సెన్సేషనల్ లుక్ వైరల్

దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. కేరళకు చెందిన ఈ అమ్మాయి.. సొంత భాషలోనే కాక తమిళం.. తెలుగు భాషల్లోనూ పెద్ద పెద్ద సినిమాలు చేసింది. ఐతే కెరీర్ మాంచి ఊపుమీదుండగానే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందామె. పెళ్లి తర్వాత ఆమెకు ఛాన్సులు తగ్గాయి. కానీ విజయ్ నుంచి విడాకులు పొందాక మళ్లీ ఆమె కెరీర్ ఊపందుకుంది. అంతకుముందు లాగే బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ అవడంతో అమలా మళ్లీ బిజీ అయిపోయింది. పెళ్లికి ముందు కంటే కూడా ఆమె ఇప్పుడు బోల్డ్‌గా నటిస్తుండటం విశేషం. ‘తిరుట్టు పయలె’ సినిమాలో చాలా హాట్ హాట్‌గా నటించి కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిందామె.

ఇప్పుడు ‘ఆడై’ అనే సినిమాలో అమలా మరింత బోల్డ‌్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒంటిపై చాలా తక్కువ బట్టలతో.. గాయాలతో కనిపిస్తోంది అమలా ఇందులో. చూడ్డానికిది ఇంటెన్స్ ఫిలిం లాగా అనిపిస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. అమలా బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ అయినట్లే కనిపిస్తోంది. గత ఏడాది ‘మెయ్యాదమాన్’ అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆడై అంటే డ్రెస్ అని అర్థం. ఆ పేరుతో సినిమా చేస్తూ.. హీరోయిన్‌ను చాలా తక్కువ బట్టలతో చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో తన కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని అమలా పాల్ అంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు