రవిశాస్త్రితో డేటింగ్.. ఆమె స్పందన ఇదీ

రవిశాస్త్రితో డేటింగ్.. ఆమె స్పందన ఇదీ

భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి.. బాలీవుడ్ నటి  నిమ్రత్‌ కౌర్‌ తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్త నిన్నట్నుంచి పెద్ద చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. రవిశాస్త్రి హ్యాష్ ట్యాగ్ నిన్నంతా ట్విట్టర్లో టాప్ లో ట్రెండ్ అయింది. రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోందని.. ఒక వాణిజ్య కార్యక్రమంలో భాగంగా కలిసిన వీళ్లిద్దరూ తర్వాత దగ్గరయ్యారని ఓ ఇంగ్లిష్ పత్రిక రాసిన కథనం సంచలనం రేపింది. దీనిపై సోషల్ మీడియా జనాలు రవిశాస్త్రిని రఫ్ఫాడుకుంటున్నారు.

ఐతే ఈ వ్యవహారంపై ఇంకా రవిశాస్త్రి ఏమీ స్పందించలేదు. కానీ నిమ్రత్ మాత్రం అప్రమత్తమైంది. ఇవి గాలి వార్తలంటూ ఖండించింది. సూటిగా విషయం చెప్పలేదు కానీ.. ఇదంతా ఫేక్ న్యూస్ అని మాత్రం ఆమె తేల్చేసింది. తన గురించి ఈ రోజు మీడియాలో రాస్తున్నదంతా కల్పన అని.. కానీ ఇలాంటివి బాధ పెడతాయన్నది మాత్రం నిజం అని ఆమె అంది. ఇలాంటి సమయంలో ఎక్కువ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందని.. దాని వల్ల తర్వాత తనకు రూట్ కెనాల్ అవసరమవుతుందేమో అని నిమ్రత్ చమత్కరించింది.

మరి ఈ వ్యవహారంపై రవిశాస్త్రి ఏమంటాడో చూడాలి. రవిశాస్త్రి వయసు 56 కాగా.. నిమ్రత్ కు 36 ఏళ్లు. రవిశాస్త్రికి గతంలోనే పెళ్లయింది. ఐతే తన భార్యతో ఆయనకు విభేదాలున్నాయని.. విడాకుల దాకా వెళ్లారని గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుత సంబంధాలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో నిమ్రత్ తో ప్రేమాయణం వార్త పెద్ద చర్చనీయాంవమైంది. మోడల్ గా కెరీర్ ఆరంభించిన నిమ్రత్.. తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ‘లంచ్ బాక్స్’.. ‘ఎయిర్ లిఫ్ట్’ లాంటి సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు