మోహన్ బాబు కాదు.. నాగబాబు

మోహన్ బాబు కాదు.. నాగబాబు

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో లెజెండరీ యాక్టర్ ఎస్వీ రంగారావు పాత్రలో మంచు మోహన్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఎస్వీఆర్ పాత్రకు సరిపోయే ఆహార్యం.. నటనతో మోహన్ బాబు నూటికి నూరు శాతం ఆ పాత్రకు న్యాయం చేశారు. ఎస్వీఆర్ పాత్రను పోషించగల స్థాయి తనకు మాత్రమే ఉందని ఆయన చాటిచెప్పారు.

 ఐతే నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలోనూ ఎస్వీఆర్ పాత్రను మోహన్ బాబే చేస్తున్నారని.. ఆయన త్వరలోనే షూటింగుకి కూడా రాబోతున్నారని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం.

‘యన్.టి.ఆర్’ సినిమాలో ఎస్వీఆర్ పాత్రను మెగా బ్రదర్ నాగబాబు చేస్తున్నాడన్నది తాజా కబురు. ఆయన ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడని కూాడ అంటున్నారు. ఆహార్యం విషయంలో నాగబాబు ఎస్వీఆర్ ను మ్యాచ్ చేయగలరేమో కానీ.. నటన పరంగా ఆ పాత్రలో ఈయన మెప్పించగలడా అన్నది డౌటు. నిజానికి బాలయ్య సినిమాలో చిరు తమ్ముడు నటిస్తున్నాడంటేనే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరోవైపు మోహన్ బాబు కుటుంబంతో బాలయ్యకు మంచి సంబంధాలున్నాయి.

ఆ సాన్నిహిత్యంతోనే ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’లో ఓ కీలక పాత్ర చేశాడు. మరోవైపు ఎన్టీఆర్‌కు కూడా మోహన్ బాబు సన్నిహితంగా ఉండేవారు. మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చూస్తే ‘యన్.టి.ఆర్’ సినిమాలో మోహన్ బాబు నటించాలి. కానీ ఆయన కాకుండా నాగబాబు ఎస్వీఆర్ పాత్రను చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు