దేవరకొండ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

దేవరకొండ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఏడాది పాటు గ్యాప్ వచ్చేసింది విజయ్ దేవరకొండ కెరీర్లో. మధ్యలో ‘ఏ మంత్రం వేసావె’ అనే సినిమా వచ్చింది కానీ దాన్ని విజయ్ సహా ఎవరూ పట్టించుకోలేదు. ఐతే తన తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగా నిరీక్షించారో ‘గీత గోవిందం’ రూపంలో అంత మంచి ఎంటర్టైనర్ అందించి వినోదంలో ముంచెత్తాడు విజయ్. ఈ ఏడాదిలోనే ఇంకో రెండు రిలీజ్‌లతో తన ఫ్యాన్స్ ‌ను మరింత మురిపించడానికి అతను సిద్ధమవుతున్నాడు.

‘గీత గోవిందం’ చేసిన ‘గీతా ఆర్ట్స్’ బేనర్లోనే విజయ్.. ‘ట్యాక్సీవాలా’ అనే సినిమా చేయగా.. అది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల వాయిదా పడింది. దాని రిలీజ్ సంగతి ఎటూ తేలకుండానే విజయ్ నటిస్తునన మరో సినిమా విడుదల తేదీ ఖరారు చేసుకోవడం విశేషం.

తమిళంలో ‘అరిమా నంబి’.. ‘ఇరుముగన్’ (తెలుగులో ఇంకొక్కడు) సినిమాలు తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ అక్టోబరు 4న విడుదలవుతుందట. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ముందు ‘ట్యాక్సీవాలా’నే విడుదలవుతుందని.. ‘నోటా’ ఏడాది చివర్లో వస్తుందని ఇంతకుముందు అన్నారు కానీ.. ఇప్పుడు విజయ్ ప్లాన్ మారిపోయిందట.

‘నోటా’ అందరికీ కనెక్టయ్యే కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో దీన్నే ముందు రిలీజ్ చేయాలని అతను డిసైడయ్యాడట. ‘నోటా’ వచ్చిన నెల తర్వాత నవంబర్లో ‘ట్యాక్సీవాలా’ రిలీజయ్యే అవకాశాలున్నాయి. అంటే మూడు నాలుగు నెలల వ్యవధిలో విజయ్ మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు