ట్విట్టర్లో పవన్ ప్రకంపనలు

ట్విట్టర్లో పవన్ ప్రకంపనలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ట్విట్టర్ మోతెక్కిపోయింది. పవన్ ఆల్రెడీ సినిమాలకు టాటా చెప్పాడు. పైగా అతడి చివరి సినిమా ‘అజ్నాతవాసి’ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆ ప్రభావమేమీ ఈ రోజు కనిపించలేదు. నిన్న రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో పవన్ పుట్టిన రోజుకు సంబంధించి 74 లక్షల ట్వీట్లు పడటం విశేషం.

‘హెచ్‌బీడీ జనసేనాని పవన్ కళ్యాణ్’ అనే హ్యాష్ ట్యాగ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇండియా మొత్తంలో టాప్‌లో ట్రెండ్ అయింది ఈ రోజు. ట్విట్టర్లో ఒక పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్‌తో అత్యధిక ట్వీట్లు పడింది పవన్ కళ్యాణ్‌కే. ఇండియాలో ఈ రోజు ఇదే అతి పెద్ద ట్విట్టర్  ట్రెండ్‌గా నిలిచింది.

10 మిలియన్.. నుంచి 70 మిలియన్ వరకు ఆయా మార్కుల్ని అత్యంత వేగంగా అందుకున్న హ్యాష్ ట్యాగ్ కూడా ఇదేనట. సామాన్య అభిమానుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ పవన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సినీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ మీద అభిమానం చూపించింది. దీంతో ట్వీట్లు పోటెత్తాయి. పవన్ ఘనతల్ని.. గొప్పదనాన్ని పొగిడేస్తూ ఎవరి స్థాయిలో వాళ్లు అభిమానాన్ని చాటుకున్నారు.  

పవన్ రాజకీయాల్లో బాగా బిజీ కావడం.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అతడి పీఆర్ టీంలు కూడా పవన్ పుట్టిన రోజున చాలా యాక్టివ్‌గా పని చేశాయి. పవన్ మీద అనేక వీడియోలు రూపొందించి పాపులర్ చేశాయి. అభిమానుల్ని బాగా మొబైలైజ్ చేశారు. దీంతో ట్విట్టర్లో రికార్డుల మోత మోగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు