సమంత త్యాగం చేద్దామనుకుంది కానీ..

సమంత త్యాగం చేద్దామనుకుంది కానీ..

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. భార్యాభర్తలైన అక్కినేని నాగచైతన్య.. సమంత బాక్సాఫీస్ పోరుకు రెడీ అయిపోయాడు. సమంత సినిమా ‘యు టర్న్’ ఇంతకుముందే వినాయక చవితికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. ఆగస్టు 31న రావాల్సిన ‘శైలజారెడ్డి అల్లుడు’ అనివార్య కారణాలతో వాయిదా పడి సెప్టెంబరు 13కే షెడ్యూల్ అయింది. ఐతే సమంత సినిమాతో పోటీ పడే విషయంలో చైతూ చాలానే ఆలోచించాడు. చివరికి అనేక తర్జన భర్జనల అనంతరం తప్పక ఆ డేటే తీసుకున్నాడు. ఐతే చైతూ సినిమా పెద్దది కావడం.. దానికి ఫెస్టివల్ వీకెండ్ బాగా కలిసొచ్చేలా ఉండటంతో ఒక దశలో సమంత త్యాగం చేద్దామనుకుందట. తన సినిమాను వారం వాయిదా వేయిద్దామని చూసిందట. ఐతే ‘యు టర్న్’ దర్శక నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదని సమంత చెప్పడం విశేషం.

తనకు, చైతూకు గొడవ పెట్టాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సమంత చమత్కరించింది. ఈ జోకుల సంగతి పక్కన పెడితే.. తమ సినిమాలు రెండూ భిన్నమైనవని.. పండగ వీకెండ్ కాబట్టి రెండు సినిమాలకూ మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నామని.. తమ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నామని సమంత చెప్పింది. కన్నడలో విజయవంతమైన ‘యు టర్న్’కు రీమేక్ గా సమంత నటించిన చిత్రం వెనుక చైతూ ప్రమేయం కూడా ఉంది. వీళ్లిద్దరూ కలిసి చూసే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడయ్యారు. సొంతంగా నిర్మాతల్ని కూడా సమకూర్చారు. కొంత మేర వీళ్లిద్దరి పెట్టుబడి కూడా ఆ చిత్రంలో ఉందంటారు. మరోవైపు చైతూ మూవీ ‘శైలజారెడ్డి అల్లుడు’ రషెస్ చూసి సమంత కూడా మార్పులు చేర్పులు చెప్పిందన్న ప్రచారం నడుస్తోంది. కాబట్టి రెండు సినిమాల్లో భార్యాభర్తలిద్దరి జోక్యం ఉంది. రెండు సినిమాలూ వారికి కీలకమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు